రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. నాయకులకు.. పార్టీలకు మధ్య సంబంధాలు.. నాయకుల దూకుడు, పార్టీల వ్యూహాలు.. వెరసి.. ఎన్నికల సమయానికి ఏదైనా జరగొచ్చు.. అనే కామెంట్లు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే..తాజాగా వైసీపీ సర్కారు విషయంలో.. ఓ కీలక విషయంపై మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓటర్లను తికమకపెట్టి.. తమకు అనుకూలంగా పరిస్థితిని కల్పించుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా స్కెచ్ వేసిందనేది ఈ వార్తల సారాంశం. అయితే.. ఇది సాధ్యమేనా? అనేది చర్చ.
విషయం ఏంటంటే.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ కార్యక్రమాన్ని జోరుగా ముందుకు తీసుకు వెళ్తోంది. ఎమ్మెల్యేలు, మంత్ రులను కూడా రంగంలోకి దింపింది. ప్రతి ఇంటికీ వలంటీర్లతో కలిసి వెళ్లి.. మా నమ్మకం నువ్వే జగన్ అన్న పోస్టర్‌ను అంటిస్ తున్నారు. అదేసమయంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇలా తెలుసుకునే క్రమంలో వైసీపీకి అనుకూలం గా ఎవరున్నారు? వ్యతిరేకంగా ఎవరున్నారు? అనే విషయాలను పసిగడుతున్నారట. తమకు అనుకూలంగా ఉంటే సరి. లేకపోతే.. వ్యతిరేకులుగా గుర్తిస్తున్నారనేది కథనం సారాంశం.
వ్యతిరేకులు అంటే..స్టిక్కర్లు వద్దనే వారు. వేసిన వెంటనే.. ఒకటి రెండు రోజుల్లోనే స్టిక్కర్లను తీసేసేవారు.. అని గుర్తిస్తారు. ఇక, వీరిని నచ్చజెప్పేందుకు వైసీపీకి అనుకూలంగా ఓటు వేయించేందుకు వలంటీర్లు శత విధాల ప్రయత్నిస్తారు. అయితే.. అప్పటికీ కూడా.. ప్రజలు వారి మాట వినకపోతే.. మాత్రం ఖచ్చితంగా వారిని వ్యతిరేక వర్గంగా గుర్తించి.. వీరి ఓట్లపై పెత్తనం చేస్తారనేది మీడియా వర్గాల కథనం. అంటే.. వారికి ఓట్లు ఎక్కడ ఉన్నాయో.. తెలియకుండా చేయడం. సాధారణంగా ఓటింగ్ రోజున యథా ప్రకారం.. ఓటర్లకు ఇచ్చిన బూత్‌కు వెళ్తారు. కానీ, వారికి అక్కడ ఓటు ఉండదు. దీంతో వారి తిరిగితిరిగి.. వేసారి ఇంటి బాట పడతారు.
దీంతో వ్యతిరేక వర్గం ఓట్లు తగ్గిపోయి.. వైసీపీ విజయం దక్కించుకుంటుందన్నది ఈ కథనంలో కోణం. అయితే.. ఇది సాధ్యమే నా? అనేది మేధావులప్రశ్న. ఎందుకంటే.. ఎలాంటి మాధ్యమాలూ లేని రోజుల్లోనే.. ఎన్నికల కమిషన్.. ఓటర్లకు స్లిప్పులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. అంటే.. ఓటరు స్లిప్పులు అనేది ఖచ్చితం. దీనిలో వార్డు నెంబరు.. పోలింగ్ బూత్ నెంబరు.. అడ్రస్, ఎక్కడ ఓటు వేయోలో కూడా అన్నీ ఉంటాయి. దీనిని ఇవ్వకుండా.. ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించడం లేదు. సో.. దీనిని బట్టి ఓటరు సులువుగా.. ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. దీనిలో రాష్ట్ర ప్రభు్త్వాలప్రమేయం కూడా ఉండదు. అయినా.. కూడా.. కల్పిత కథనాలతో ఏదో చేయాలనే ఉద్దేశం ఉందని.. మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ.. సంగతి!
This post was last modified on April 29, 2023 12:56 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…