Political News

రెండు పార్టీల్లోనూ కొత్త ముఖాల‌కు ఛాన్స్‌…?

ఏపీ అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలోనూ కొత్త ముఖాల‌కు ఛాన్స్ ఇస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీలో ఇప్ప‌టికే అధినేత జ‌గ‌న్ సిట్టింగుల జాత‌కాలను బ‌ట్టే టికెట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. త‌ర్వాత‌.. మ‌ళ్లీ కొంద‌రు నాయ‌కులు పార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడ‌డంతో ఆయ‌న మాట మార్చుకుని.. అంద‌రికీ అవ‌కాశం ఇస్తామ‌న్నారు. కానీ, ఇప్పుడు మ‌రో వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. పార్టీలో కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్టు ఆయ‌న చెబుతున్నారు. ఇది అంత‌ర్గ‌త చ‌ర్చే అయినా.. పార్టీలో మాత్రం సెగ‌లు పుట్టిస్తోంది.

ప‌త్తికొండ‌, నెల్లూరు రూర‌ల్‌, ఆత్మ‌కూరులోనూ.. మార్పులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు. ఇక‌, కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే మార్పులు ఖాయ‌మ‌ని తెలిసిపోయింది. గిద్ద‌లూరు, గూడూరు, గుంటూరు ప‌శ్చిమ‌, ప్ర‌త్తిపాడు, రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌ర్పు లు ఖాయ‌మ‌ని వైసీపీలో చ‌ర్చ‌సాగుతోంది. ఇక్క‌డ కొత్త ముఖాల‌కు అవ‌కాశం ఇస్తార‌ని అంటున్నారు. పార్టీలో ఉన్న‌వారినే తీసుకుంటారా? లేక‌.. బ‌య‌ట నుంచి కూడా ఎవ‌రినైనా తీసుకుంటారా? అనేది ఆస‌క్తిగా మారింది. ఇక‌, టీడీపీ విష‌యంలోనూ ఇదే చ‌ర్చ‌సాగుతోంది.

ఎన్నిక‌ల స‌మయానికి గెలుపుగుర్రాలుగా భావించే నేత‌ల‌ను ప‌ట్టాలెక్కించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. వీరిలో కొత్త‌వారు ఎక్కువ‌గా ఉంటార‌ని చెబుతున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే కాకుండా.. ప్రస్తుతం పార్టీకి ద‌న్నుగా ఉన్న నాయ‌కుల‌ను కూడా లెక్క‌ల్లోకి తీసుకుని.. వారితో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది.. చంద్ర‌బాబు వ్యూహంగా ఉందని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. సీనియ‌ర్ల‌కు య‌థాత‌థంగా సీట్లు ద‌క్క‌నున్నాయ‌నేది ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఎలా చూసుకున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఆమోదం ఉన్న నాయ‌కుల‌కు ప‌ట్టం క‌డ‌తార‌ని తెలుస్తోంది. ఇక‌, మ‌రోవైపు.. ఇప్ప‌టికే ఆశావ‌హులుగా ఉన్న వార‌సుల విష‌యంపైనా..చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. వీరిలో ఎంత‌మంది గెలుపు గుర్రాలు ఎక్కుతారు.. ? ఎంత మంది కేవ‌లం టికెట్ల రేసులో ఉన్నార‌నేది కూడా ఆయ‌న నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. పైపైన మాట‌లు చెప్పి టికెట్లు ఇవ్వ‌మంటేనో.. సిఫార‌సులు చేయించుకుని వ‌స్తేనో.. ఈ సారి టికెట్ క‌ష్ట‌మేన‌ని మొహంపైనే చెప్పేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రెండు పార్టీల్లోనూ కొత్త ముఖాలు ఖాయ‌మ‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 29, 2023 6:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

1 hour ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

7 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

8 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

10 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

12 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

13 hours ago