రాష్ట్రాన్ని కాపాడటానికి 5 కోట్ల మంది ఒకటి కావాలనని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలంతా చేయి చేయి పట్టుకుని జగన్ను దించాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ప్రలోబాలు కాదని, ప్రజలు టీడీపీని గెలిపించారని తెలిపారు. ‘వై నాట్ కుప్పం’ అన్న వారికి పులివెందులలో జెండా ఎగరేసి సమాధానం చెప్పామని గుర్తుచేశారు.
బీసీ యువకుడు చనిపోతే పరిహారంలో మంత్రి అంబటి వాటా అడిగారని చంద్రబాబు ఆరోపించారు. దివ్యాంగులకు 3 చక్రాల వాహనం ఇవ్వలేని సంక్షేమం ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అమరావ తి నిర్మాణం పూర్తయితే మీ ఆదాయం పెరిగేదని చంద్రబాబు వెల్లడించారు. తెలివిలేనివాళ్లు అధికారం లోకి వస్తే దోపిడీ తప్ప మరేమీ ఉండదని చంద్రబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా మేడికొండూరులో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు దీటుగా అమరావతిని నిర్మించాలని అనుకున్నానని అన్నారు. కానీ ప్రజలు జగన్ మాట లు విని మోసపోయారని పేర్కొన్నారు. చివరికి రాజధాని ఉన్న తాడికొండలోనూ వైసీపీని గెలిపించారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు ఎన్ని చేసినా అమరావతే రాజధానిగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నా రు. రాజధాని రైతులు చేస్తోంది ధర్మపోరాటమన్న చంద్రబాబు.. జగన్ ఆడుతున్న మూడుముక్కలాట సాగదని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు కూలి పనుల కోసం వచ్చిన వారిని కలిశాననీ.. వారి బాధలు నన్ను కలచివేసాయని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఒక్కరినీ తాను అధికారంలోకి రాగానే ఆదుకుం టానని చెప్పారు. మరొక్క ఏడాది భరించాలని పిలుపునిచ్చారు. కాగా, చంద్రబాబు కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు.
This post was last modified on April 29, 2023 6:21 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…