వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మ ఘోష పెడుతున్నారు. తమ మాటకు విలువ లేకుండా పోయిందని తల్లడిల్లుతు న్నారు. తాము ఇలా అయిపోవడానికి ఆయనే కారణం అంటున్నారు వైసీపీలోని కీలక నాయకులు. పైకి పేరు చెప్పేందుకు కొందరు సాహసం చేయకపోయినా.. తమను నానారకాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ.. ఒక సలహాదారుపై వారు విరుచుకుపడుతున్నారు. “మేమేదో.. మాకు తెలుసు. మధ్యలో ఆయన పెత్తనం మాకెందుకు?” అని మెజారిటీ ఎమ్మెల్యేలు.. ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రుల వద్దే కుండబద్దలు కొడుతున్నారు.
వైసీపీలో ఒకప్పుడు పార్టీ అధినేత జగన్‌కు.. నాయకులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. నేరుగా ఆయనతో మాట్లాడుకునేందుకు కూడా అనుమతి ఉండేది. అయితే.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అన్ని పద్ధతులు మారిపోయాయి. సీఎం జగన్‌ను ఒక ప్రతిష్టాత్మక నాయకుడిగా తీర్చిదిద్దాలనే క్రమంలో ఆయనకు నేతలకు మధ్య గ్యాప్ పెంచారనే వాదన బలంగా ఉంది. ఇదే.. ఇప్పుడు పార్టీని నిలువునా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు.
అందుకే.. నేతల్లో అసంతృప్తి పెరిగిపోయిందని చెబుతున్నారు. ఏ విషయంపై మాట్లాడాలన్నా.. ముందు గా సీఎంవో అనుమతి.. తర్వాత.. సలహాదారు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి పెరిగిపోయిందని అంటున్నారు. దీనిని మెజారిటీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రధానంగా గత ఏడాది జరిగిన మం త్రి వర్గ విస్తరణలో సదరు సలహాదారు.. అన్నీతానై వ్యవహరించడం వల్లే.. తమకు రావాల్సిన పదవులు రాకుండా .. పోయాయనే వాదనను చాలా మంది నాయకులు చెబుతున్నారు.
గుంటూరు కు చెందిన వ్యక్తికి మంత్రి పదవి దక్కడంపైనా.. నాయకుల్లో అసంతృప్తి ఉంది. అదేవిధంగా కొత్తగా వచ్చిన వారికి కూడా మంత్రి పదువులు ఇవ్వడం వెనుక ఆయనే చక్రం తిప్పారనే వాదన కూడా వినిపించింది. వెరసి ఇవన్నీ కూడా నేతలను పార్టీకి దూరం చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఒక సలహాదారు కారణంగా.. పార్టీ మరింత పుంజుకోవాల్సి ఉండగా.. ఇప్పుడు దీనికి రివర్స్‌లో జరుగుతుండడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు మరో పది మాసాలే గడువు ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారాలనేది మెజారిటీ నేతలు కోరుతున్న మాట. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 29, 2023 4:31 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…