భారత్‌లో జనాభా.. తాజాగా చైనాను దాటేసింది. సుమారు 50 లక్షల మందికి పైగా చైనా కంటే భారత్‌లో జనాభా పెరిగారని.. ఇటీవలే అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి. అయితే.. జనాభా నియంత్రణకు కేంద్రం కూడా దృష్టి పెట్టింది. ఎలా తగ్గించాలనే విషయంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే పదేళ్లలో జనాభా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా మేధో మథనం చేస్తోంది.
అయితే.. ఇంతలోనే.. తాజాగా భారత్ కు మిత్ర దేశం జర్మనీ.. ఈ జనాభాను ఎద్దేవా చేస్తూ.. వ్యంగ్య చిత్రాలు వెలుగులోకి రావడం.. సంచలనంగా మారింది. ఈ విషయంపై భారత ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయింది. జర్మనీ దౌత్యకార్యాలయానికి తమ నిరసన తెలిపింది. జర్మనీ మ్యాగజైన్ ‘డెర్ స్పీజెల్’ ఈ కార్టూన్‌ను ప్రచురించింది.
కార్టూన్ సారాంశం ఇదే..
చైనాకు చెందిన ఆధునిక బులెట్ రైలును, భారత్‌కు చెందిన ఓ సాధారణ రైలు దాటి వెళ్తున్నట్లుగా చిత్రీకరించింది. భారత రైలు కిక్కిరిసి ఉన్నట్లు, రైలుపై కూడా జనం భారీగా కూర్చున్నట్లుగా అందులో చూపించింది. ఈ కార్టూన్ ప్రపంచ వ్యాప్తంగా దుమారాన్ని రేపింది. ప్రధానంగా భారత్‌కు చెందిన రాజకీయ నాయకులు, నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జాత్యహంకారంతోనే కార్టూన్‌ను గీశారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. “డెర్ స్పీజెల్ లోని కార్టూనిస్టుకు ఇది చెప్పాలనుకుంటున్నాను. ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత్‌పై వ్యతిరేకత వ్యక్తం చేయడం అంత తెలివైన పని కాదు. కేవలం మరికొన్నేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థ జర్మనీని దాటనుంది” అని ఆయన పేర్కొన్నారు.
వాస్తవికతకు కార్టూన్ చాలా దూరంలో ఉందని కేంద్ర ఐటీ శాఖ సీనియర్ సలహాదారు కాంచన్ గుప్తా తేల్చిచెప్పారు. “హాయ్ జర్మనీ. ఇది పూర్తిగా జాత్యహంకారమే. మీ డెర్ స్పీజెల్ కార్టూన్ వాస్తవికతకు చాలా దూరంలో ఉంది. ఇది కేవలం భారత్‌ను దిగజార్చి, చైనా ప్రాపకం పొందేందుకే చేశారు” అని ట్వీట్ చేశారు. డెర్ స్పీజెల్ పత్రిక తన పేరును జాత్యహంకార, ట్రోలింగ్ పత్రికగా మార్చుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా సూచించారు.
సాయిరెడ్డి స్పందన
ఈ కార్టూన్‌పై వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందించారు. భారత్‌ను పేద దేశంగా చూపించేందుకే పశ్చిమ దేశాలు ఎప్పుడూ యత్నిస్తుంటాయని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
This post was last modified on April 26, 2023 3:23 pm
కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే.. అందులో హీరో హీరోయిన్ల జంట అందరినీ ఆకట్టుకుంటుంది. వాళ్లను సక్సెస్ ఫుల్ పెయిర్‌గానే…
రాజకీయాల్లో కొందరు నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు అన్నింటా ముందుండాలని కోరుకోని నేత…
మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ డబ్బింగ్ సినిమా కాబట్టి మన దగ్గర రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ పోటీని తట్టుకుని…
వైసీపీని, జగన్‌ను కూడా కాదనుకుని.. ఏపీ ప్రజలు కూటమికి ముఖ్యంగా చంద్రబాబుకు భారీ మెజారిటీ ఇచ్చి ఎందుకు గెలిపిం చారో..…
టీజర్ నుంచి పాటల దాకా ప్రశంసల కన్నా ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతున్న సల్మాన్ ఖాన్ సికందర్ ట్రైలర్ ఇవాళ…
https://www.youtube.com/watch?v=NfsTxYtBiWg ఛలో, భీష్మ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల తన రెండో సినిమా హీరో నితిన్ తో…