2024లోనూ మళ్లీ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్న ఏపీ సీఎం జగన్ అందుకోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తమకు తిరుగులేదనుకునే సొంత జిల్లా విషయంలోనూ ఆయన చాలా ప్రతిష్ఠాత్మకంగా కనిపిస్తున్నారు.
చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రం ప్రకారం ఆయన సొంత జిల్లా కడపపైనా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీకే టీంతో కడప జిల్లాలో సర్వే చేయిస్తున్నారట. ఇప్పటికే పీకీ టీం కడపలోని పల్లెపల్లెనా ప్రజానాడి పట్టుకునే పనిలో ఉంది. మరికొద్ది రోజుల్లో వీరి రిపోర్టు రానుండడంతో కడప నేతల్లో గుబులు మొదలైందట. తమకు టికెట్లు వస్తాయో రావో.. పీకే టీం ఏం చెప్తుందో అని సిటింగులు కంగారపడుతున్నారట.
కడప జిల్లాలో పీకే బృందం చేపట్టిన సర్వే తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే రిపోర్ట్ కొద్ది రోజుల్లోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి చేరనున్నట్లు సమాచారం. ఈ నివేదికలో ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది? కార్యకర్తల అసంతృప్తి సెగ ఎవరికి తగులుతుంది? వంటి అంశాలపై సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది.
ప్రతి వార్డు, ప్రతి డివిజన్, ప్రతి పంచాయతీలలో ఓటర్లను కలిసి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా! సమస్యలు పరిష్కారంలో చొరవ చూపుతున్నారా! ప్రభుత్వ పథకాలు అందుతన్నాయా వంటి అంశాలు ఉంటున్నాయి. కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే సఖ్యంగా ఉంటున్నారా ..వారి పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యే తీరు కారణంగా నియోజకవర్గంలో నష్టపోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ? ఒకవేళ సిట్టింగ్ మార్చాల్సి వస్తే మీరు చెప్పే పేర్లు ఏంటి ? ఇలా పలు రకాల ప్రశ్నావళితో సర్వే సాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేతోపాటు మరికొంత మంది నేతలపైనా సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది.
కమలాపురంలో ఆ నలుగురిపై .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ ఎమ్మెల్యేగా ఉన్న కమలాపురం నియోజకవర్గంలో నలుగురిపై సర్వే సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీ రవీంద్రారెడ్డితోపాటు ఆయన తనయుడు నరేన్ రామానుజుల రెడ్డి, జగన్ కు బాబాయి దుర్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల సలహాదారుడు రాజోలు వీరారెడ్డి పేర్లు ఈ సర్వేలో వినిపిస్తున్నాయి. కమలాపురం టిక్కెట్టు రవీంద్రనాథ్ రెడ్డికి తిరిగి ఇస్తారన్న అభిప్రాయాలు కొనసాగుతున్నప్పటికీ ఆయన తనయుడు బరిలో ఉంటారని జోరుగా ప్రచారం సాగుతోంది.
కొన్ని నియోజకవర్గాలలో పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు, వారిలో కొందరు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు కూడా సమాచారం అందడంతో ..ఈ అంశాలను కూడా సర్వే టీమ్ పరిగణనలోకి తీసుకుంటుంది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని పార్టీలోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుందని ల రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. ఈ అంశాలనూ సర్వే బృందం నమోదు చేసుకున్నట్లు సమాచారం.
బద్వేలుపైనా.. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన వెంకట డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెనే అభ్యర్థిగా నిలబెడతారా లేక అభ్యర్థిని మారుస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ తరుణంలో ఆ నియోజకవర్గం నుంచి ఆమెతోపాటు సోషియల్ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్ పులి సునీల్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటసుబ్బయ్య పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిపై సర్వే జరిగినట్లు సమాచారం. మొత్తానికి పీకే టీం సర్వేతో సిటింగులో కంగారు మొదలవగా ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
This post was last modified on %s = human-readable time difference 8:15 am
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈమధ్య మరింత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’లో నటిస్తున్నాడు.…
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు…
కొత్త ఆర్థిక, వినియోగ నియమాలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ),…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు ఎన్‌వీఎస్ ఎస్…
మాస్ హీరో గోపిచంద్ ఇటీవల విశ్వం సినిమాతో మరో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. అప్పుడెప్పుడో ‘లౌక్యం’తో కమర్షియల్ గా సక్సెస్…
ముద్రగడ పద్మనాభం. సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమాన్ని ఒంటిచేత్తో ముందుకు నడిపించిన పేరు కూడా తెచ్చుకున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ..…