ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ అదినేత చంద్రబాబు ప్రశంసలు గుప్పించారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పయనిస్తోం దన్నారు. దేశాభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల కోసం తన పరిధిలో తాను పనిచేస్తున్నానని, ప్రధాని విజన్‌తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేయడానికి సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు. దేశ బలమేంటో.. ప్రధాని మోడీ ప్రపంచానికి చాటి చెబుతున్నారని చంద్రబాబు అన్నారు.
ఈ మేరకు జాతీయ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చా వేదిక 2023లో చంద్రబాబు ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో కూడా తాను మోడీ పాలసీలను వ్యతిరేకించలేదని చెప్పారు. ఒక విజన్ కోసం పనిచేశానని, అదే విజన్ కోసం ప్రధాని మోడీ కూడా పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీకి విభజన హామీలుగా ఇచ్చిన ప్రత్యేక హోదా సెంటిమెంటుగా మారిందని, దాని మీద మాత్రమే తాను 2018-19 మధ్య కాలంలో పోరాడానని చంద్రబాబు వివరించారు. ఇది తప్ప తమ మద్య విభేదాలు లేవన్నారు.
మోడీకి మద్దతు ఇచ్చే అంశంపై మాట్లాడుతూ.. ఇది సమయం వచ్చినప్పుడు చెబుతానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్డీఏలో భాగస్వామి కావడమనేది మేటరాఫ్ టైమేనని చెప్పారు. అభివృద్ధి విషయంలో ప్రధాని ఏ ఆలోచనతో ఉన్నారో.. తానూ అదే ఆలోచనతో ఉన్నానని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీలు వేరైనా.. విజన్ ఉన్న నేతలుగా ప్రధాని మోడీ.. నేనూ మాట్లాడుకున్నామని తెలిపారు.
ప్రతి రాజకీయ పార్టీ దేశాభివృద్ధి కోసం పని చేయాలని చంద్రబాబు సూచించారు. దేశంలోను, రాష్ట్రంలోనూ సంపద సృష్టి.. పేదరిక నిర్మూలన రెండూ ముఖ్యమేనని చెప్పారు. అయితే, ఇవన్నీ టెక్నాలజీతో సాధ్యం అవుతాయని తెలిపారు. పేదరికం లేని సమాజంలో భాగంగా ప్రతి ఒక్కర్నీ ఎగువ మధ్య తరగతి కుటుంబ స్థాయికి చేర్చే ప్రయత్నం చేస్తానన్నారు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్ పాలసీని.. 4P పాలసీని రూపొందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
This post was last modified on April 26, 2023 8:08 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…