తెలంగాణ కీలకనాయకుడు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రెడ్యా నాయక్ నోరుపారేసుకున్నారు. ప్రతిపక్ష నేతలపైనా.. అధికార పార్టీ బీఆర్ ఎస్‌ను విమర్శించే వారిపైనా బూతులతో విరుచుకుపడ్డారు. లం.. కొడుకులు, గు.. బలిసి.. అంటూ.. ఆయన ఒళ్లు తెలియని విధంగా బహిరంగ వేదికపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరిన్ని పరుష పదాలతో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మంటలు రేపుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెడ్యా నాయక్ కూడా సిరోల్ మండలంలో తన అనుచరులు, అభిమానులతో సమ్మేళనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్‌కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని.. ఇతరల.. కొడుకులకు లేదని రెడ్యానాయక్ నోరు పారేసుకున్నారు. రేవంత్ రెడ్డిని బోసి.. కే అంటూ సంబోధించారు. వాడికి గు.. బలిసింది అంటూ.. బూతులు ప్రయోగించారు. దీంతో సభకు వచ్చిన వారు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారంటూ.. ఒకరికొకరు మొహమొహాలు చూసుకున్నారు. అయినా.. రెడ్యా నాయక్ తన మానాన తాను బూతు పురాణం కొనసాగించారు.
ఇదిలావుంటే, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకుడు రెడ్యానాయక్. గతంలో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అలాంటి నాయకుడి నోటి వెంట ఇలాంటి మాటలు రావటంతో సభకు వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాగా మాట్లాడేది అనే గుసగుసలు వినిపించాయి.
This post was last modified on April 26, 2023 7:42 am
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…
ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…
‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…
‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…