ప్రాణాంతక వైరస్ కరోనా విశ్యవ్యాప్తంగా ఇప్పుడు విలయ తాండవమే చేస్తోంది. అందుకు భారత్ కూడా మినహాయింపేమీ కాదనే చెప్పాలి. ఇప్పటికే భారత్ లో 21 వేల మందికి పైగా సోకిన ఈ వైరస్ 686 మంది ప్రాణాలను బలిగొంది.
ఈ వైరస్ కట్టడి కోసమంటూ కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ దాదాపుగా నెల రోజులు పూర్తి అయ్యింది. మే నెల 3 వరకు ప్రస్తుత లాక్ డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో మీడియా దిగ్గజం టైమ్స్ గ్రూపు… ప్రొటివిటీ అనే సంస్థతో కలిసి చేసిన ఓ సర్వే ఆందోళన రేకెత్తిస్తోంది. మే నెలలో కరోనా మహమ్మారి విస్తృతి భారత్ లో ఓ రేంజిలో ఉంటుందని ఈ సర్వే చెబుతోంది.
కరోనా మహమ్మారి పుట్టిన చైనాతో పాటు దక్షిణ కొరియా, అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా విజృంభణను భారత గణాంకాలతో పోలుస్తూ సాగిన ఈ సర్వే… భారత్ లో మే 22 నాటికి కరోనా రోగుల సంఖ్య 75 వేల మార్కును దాటిపోనుందని అంచనా వేసింది.
ప్రస్తుతం కొనసాగుతున్న రెండో దశ లాక్ డౌన్ ముగిసే మే 3 నాటికి 38 వేల మార్కును టచ్ చేయనున్న కరోనా విస్తృతి…మే 8 నాటికి 46 వేల మార్కును దాటేస్తుందట. అంతేకాకుండా మే 14 నాటికి మరింత విజృంభించనున్న కరోనా… ఏకంగా 65 వేల మార్కును దాటిపోయి మే 22 నాటికి 75 వేల మార్కును చేరుతుందట.
మొత్తంగా కరోనా కట్టడిలో మిగిలిన దేశాలన్నింటికంటే కూడా మెరుగైన చర్యలు తీసుకుంటున్న భారత్ లో ఈ వైరస్ ఏకంగా 75 వేల మందికి పైగా సోకనుందన్న ఈ సర్వే నిజంగానే ఆందోళనను రేకెత్తించేదిగానే ఉందని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే… లాక్ డౌన్ ను మే3 నాటికే పరిమితం చేస్తే కరోనా విస్తృతిని కట్టడి చేయలేమని చెప్పేసిన ఈ సర్వే… అసలు భారత్ లో కరోనా రోగుల సంఖ్యను జీరో స్థాయికి చేర్చేందుకు ఏం చేయాలన్న విషయాలపైనా ఆసక్తికర అంచనాలను వెల్లడించింది. మే 3న రెండో దశ లాక్ డౌన్ ముగిసినా… లాక్ డౌన్ ను మరింత కాలం పాటు పొడిగించడమే మంచిదన్న విషయాన్ని చెప్పిన ఈ సర్వే… మే 15 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తే… దేశంలో కరోనా కేసులు జీరో స్థాయికి చేరడానికి సెప్టెంబర్ 15దాకా సమయం పడుతుందని తెలిపింది.
అదే సమయంలో లాక్ డౌన్ ను మే చివరి దాకా పొడిగిస్తే… జూన్ మధ్యలోనే కేసుల సంఖ్య జీరో స్థాయికి పడిపోతుందని ఈ సర్వే చెప్పింది. మొత్తంగా దేశంలో కరోనా విస్తృతి, కేసుల సంఖ్యను జీరో స్థాయికి చేర్చాలంటే ఏం చేయాలన్న విషయాలపై ఈ సర్వే చెప్పిన అంశాలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయని చెప్పక తప్పదు.
This post was last modified on April 23, 2020 5:44 pm
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…