Political News

ఇలాంటి సర్వేలతో చేటే ఎక్కువ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల్లో చాలామంది నిన్నట్నుంచి సంబరాల మోడ్‌లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నట్లుగా టైమ్స్ నౌ ప్రకటించిన సర్వేలో తేలడమే అందుక్కారణం.

ఏపీలో ఉన్న ఎంపీ సీట్లే 25 అయితే.. ఆ పార్టీ 24 లేదా 25 స్థానాలు దక్కించుకుంటుందని టైమ్స్ నౌ ప్రకటించింది. కేంద్రంలో మోడీ హవా కొనసాగనున్నట్లు.. బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్‌‌ మెజారిటీ సీట్లు దక్కించుకోనున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఐతే మిగతా పార్టీల విషయంలో సర్వే అంచనాలు వాస్తవంగానే అనిపిస్తున్నప్పటికీ.. వైసీపీ మరోసారి ఏపీలో క్వీన్ స్వీప్ చేయబోతోందని.. గత పర్యాయం సాధించిన 23 సీట్లను కూడా మించబోతోందని ఈ సర్వే ప్రకటించడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వైసీపీ పై గత ఏడాది కాలంలో విపరీతంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఆ ప్రభావం మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జనాల్లోకి వెళ్లడానికి భయపడే పరిస్థితి వస్తోంది. వాళ్లు వెళ్లినా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు చిత్తుగా ఓడిపోతారని గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్లు అంటున్నారు. జగన్ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఈ సర్వేలో ఇలాంటి ఫలితాలు రావడం ఆశ్చర్యకరం. వైసీపీలోనే చాలామంది ఈ సర్వేను నమ్మట్లేదు. చాలామంది ఈ సర్వే మీద కామెడీ చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఇతర వ్యవహారాలతో ఢీలా పడ్డ వైసీపీ క్యాడర్‌లో ఉత్సాహం నింపడానికి ఈ సర్వేను మేనేజ్ చేశారనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ అయితే ఈ సర్వేను చూసి ఎంతమాత్రం కంగారు పడట్టేదు. అదొక ఫేక్ సర్వే అని బలంగా నమ్ముతోంది. అందుకే చాలా లైట్ అన్నట్లు ఉంటున్నారు ఆ పార్టీ మద్దతుదారులు. న్యూట్రల్‌గా ఉండేవాళ్లకైతే ఈ సర్వే మీద ఎంతమాత్రం నమ్మకం కుదరట్లేదు.

దీన్ని కామెడీగా తీసుకుంటున్నారు. ఈ సర్వేలో వైసీపీకి 15 ప్లస్ సీట్లు వస్తాయని పేర్కొని ఉంటే రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉండేదేమో. అప్పుడు టీడీపీ కంగారు పడేది. జగన్ గ్రాఫ్ పడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నా ఇప్పటికీ తమదే ఆధిక్యం అని వైసీపీలో జోష్ వచ్చేది. అలా కాకుండా క్లీన్ స్వీప్ సంకేతాలు రావడంతో వైసీపీలోనే ఒక వర్గం ఈ సర్వేను లైట్ తీసుకుంటోంది. ఈ సర్వేను నమ్మే వైసీపీ సపోర్టర్లలో ఓవర్ కాన్ఫిడెన్స్‌ వచ్చినా అదీ ప్రమాదమే. ఇలా ఏ రకంగా చూసినా ఈ సర్వే వైసీపీకి ఉపయోగపడేది కాదని జగన్ అండ్ కో అర్థం చేసుకుంటే మంచిది.

This post was last modified on April 22, 2023 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వెంకీ VS వెంకీ – ఎలా సాధ్యమవుతుంది

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త ఫ్యాన్స్ లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్…

55 minutes ago

అన్నదమ్ముల గొడవ… సర్దిచెప్పేవారే లేరా?

కేశినేని బ్రదర్స్ మధ్య రాజుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం ఏపీలో కలకలమే రేపుతోంది. పదేళ్ల పాటు విజయవాడ ఎంపీగా నాని…

1 hour ago

100 కోట్ల ధైర్యం ఇచ్చిన అర్జున్ సర్కార్

మొదటి వారం కాకుండానే హిట్ 3 ది థర్డ్ కేస్ వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. కేవలం నాలుగు రోజులకే…

2 hours ago

సూర్యకు మూడు వైపులా స్ట్రోకులు

ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తూ తనకో బ్లాక్ బస్టర్ ఇస్తాడని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మీద సూర్య పెట్టుకున్న నమ్మకం…

2 hours ago

ట్రంప్ దెబ్బ : ఆందోళనలో ప్యాన్ ఇండియా సినిమాలు

అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా…

3 hours ago

తమిళులు లేపుతున్నారు.. తెలుగోళ్లు లైట్ అంటున్నారు

గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…

10 hours ago