ఏపీ మంత్రి, విద్యావేత్త, కేంద్ర మాజీ అధికారి ఆదిమూలపు సురేష్ హల్చల్ చేశారు. నడిరోడ్డుపై చొక్కా విప్పేసి.. టీడీపీ నేతలకు సవాళ్లు రువ్వారు. దీంతో ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎర్రగొండపాలెంలో పర్యటించనున్న నేపథ్యంలో ఇక్కడ హై టెన్షన్ కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూ లపు సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద రోడ్డుపైకి వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. మంత్రితోపాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి, నల్లబెలూన్లతో చంద్రబాబు గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు.
ఈ క్రమంలో మంత్రి తన చొక్కా విప్పిన నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్ చేసిందనే విమర్శలు టీడీపీ నుంచి వినిపించాయి. మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరువర్గాలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
మరోవైపు.. టీడీపీ నాయకులు తనను తగలబెడతానన్నారని, దమ్ముంటే ఆపని చేయాలని మంత్రి సురేష్ సవాల్ రువ్వారు. ఈ క్రమంలోనే ఆయన చొక్కా విప్పి మరీ సవాళ్లకు దిగడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
దళిత ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో దళితులు నిరసనలు తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి జిల్లాలో పర్యటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దళిత ద్రోహి. చంద్రబాబుకు యర్రగొండపాలెంలో అడుగుపెట్టే అర్హత లేదు.
దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను మా ప్రభుత్వమే పూర్తి చేసింది. శాంతియుతంగా చంద్రబాబుకు నిరసన తెలుపుతున్నాం అని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. తనను టీడీపీ నేతలు తగలబెడతామన్నారని.. దమ్ముంటే తగల బెట్టాలని ఆయన సవాల్ రువ్వారు.
This post was last modified on April 22, 2023 10:54 am
ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…