Political News

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, టీటీడీ కు అడ్డంగా దొరికిపోయారు

పెద్దల సభ సభ్యుడు తిరుమలలో అక్రమాలకు తెర తీసారు. ఎమ్మెల్సీగా తిరుమలలో తనకు ఉన్న అవకాశాలను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించారు. టీటీడీ విజిలెన్స్ కు అడ్డంగా దొరికిపోయారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు ఎప్పుడూ పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.

అయితే, శ్రీవారిని త్వరగా దర్శించుకొని వెళ్లిపోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. దానికోసం అడ్డదారులు తొక్కి అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు ఉంటాయి. ఇక, తమకు ఉన్న పలుకుబడితో ప్రజాప్రతినిధులు, నేతలు కూడా భక్తులకు దర్శనం చేయించిన సందర్భాలు లేకపోలేదు.. ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు టీటీడీ విజిలెన్స్‌ కట్టడి చేస్తూనే ఉంటుంది.. తాజాగా, విజిలెన్స్‌ వలలో చిక్కారు ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ.

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ తరచు శ్రీవారి దర్శనానికి వస్తుండడంతో అనుమానించిన టీటీడీ ఉన్నతాధికారులు.. దీనిపై విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు. అయితే, రంగంలోకి దిగిన విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించింది. ఫోర్జరీ ఆధార్‌ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తున్నట్టు గుర్తించింది.. ఆరుగురి దర్శనం కోసం లక్షా 5 వేల రూపాయలను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఈ మొత్తాన్ని ఎమ్మెల్సీ డ్రైవర్‌ ఖాతాకు సదరు భక్తులు పంపారని విజిలెన్స్‌ అధికారులు చెబుతున్నారు.

ఇక, నెల రోజుల వ్యవధిలో 19 సిఫార్సు లేఖలు జారీ చేశారట ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ.. ప్రతి సిఫార్సు లేఖను ఎమ్మెల్సీ ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకే ఇచ్చినట్లు టీటీడీ విజిలెన్స్‌ గుర్తించింది. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీ పై కేసు నమోదు చేశారు. తిరుమల ఒకటో నంబర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.

టీటీడీలో ద‌ళారుల ఏరివేత చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశామ‌ని, టికెట్ల అమ్మ‌కానికి పాల్ప‌డే వ్య‌క్తులు ఎంత‌టి వారైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈవో ధ‌ర్మారెడ్డి హెచ్చ‌రించారు. ఇందుకు ఎమ్మెల్సీపై కేసు న‌మోదే ఉదాహ‌ర‌ణగా ఆయ‌న చెప్పుకొచ్చారు.

This post was last modified on April 22, 2023 9:49 am

Share
Show comments
Published by
Satya
Tags: Shaik Sabji

Recent Posts

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

32 minutes ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

3 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

4 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

5 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

6 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

6 hours ago