రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్రమోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రుల్లో కొందరు హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే మోడీ మాత్రం ఏకంగ ప్రధానమంత్రి పదవి కోసం హ్యాట్రిక్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు సరే మరి సాధ్యమవుతుందా ? తాజాగా వెల్లడైన ఒక సర్వే రిపోర్టు ప్రకారం మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే టైమ్స్ నౌ-ఈటీజీ సర్వేలో బీజేపీ కూటమి మంచి మెజారిటితోనే మూడోసారి అధికారంలోకి వస్తుందని తేలింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీ కూటమికి 292-338 సీట్లు రావటం ఖాయమని తేలింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమికి 106-144 సీట్లు వస్తాయట. ఇతరులకు అంటే నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలు 66-96 సీట్లు గెలుస్తాయని సర్వేలే తేలిందట. ప్రధానమంత్రి అభ్యర్ధిగా నరేంద్రమోడీకి 64 శాతం మంది మద్దతు పలికారట. రాహుల్ గాంధీకి 13 శాతం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 12 శాతం మంది జనాలు ప్రధానమంత్రి పోస్టుకు మద్దతు పలికారట.
బీజేపీ కూటమికి 38.2, కాంగ్రెస్ కూటమికి 28.7 శాతం, ఇతరులకు 33 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలిందని సదరు సంస్ధలు చెప్పాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే ఎన్డీయే సీట్ల పెరుగుదలలో పెద్ద ప్లస్సేమీలేదు. ఇప్పుడున్న సీట్లు సుమారు 320. అంటే అదనంగా మరో 18 మాత్రమే వస్తాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమి గెలుచుకునే సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. అలాగే నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ సీట్ల సంఖ్య దాదాపు వందకు చేరుకుంటాయి.
అంటే ఇప్పటికన్నా పార్లమెంటులో రేపటి ఎన్నికల తర్వాత బలమైన ప్రతిపక్షం తయారవుతుందని అర్ధమవుతోంది. బీజేపీ కూటమికి 338 సీట్లు వస్తాయంటే పెద్దగా పెరుగుదల లేదని అర్ధమవుతోంది. కాకపోతే బలమైన ప్రతిపక్షం లేదు కాబట్టి మూడోసారి కూడా బీజేపీ కూటమే అధికారంలోకి వస్తోంది. ఇదే సమయంలో ఏపీలో వైసీపీకి 24 లేదా 25 పార్లమెంటు సీట్లు వస్తాయని సర్వే చెప్పింది. అంటే వైనాట్ 175 ? అనే జగన్మోహన్ రెడ్డి స్లోగన్ నిజమవుతుందా ?
This post was last modified on April 22, 2023 9:34 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…