సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక, హత్యకన్నా ఎక్కువగా ఇప్పుడు తెరమీదికి వస్తున్న ట్విస్టులపై ట్విస్టులు మరింతగా కేసును ఉత్కంఠగా మార్చాయి. వివేకా కుమార్తె సీబీఐ దర్యాప్తును కోరడం.. తర్వాత పరిణామాల్లో ఏకంగా కడప ఎంపీ చుట్టూ ఉచ్చు బిగిస్తుండడం కేసు తీవ్రతను పెంచేసేంది. ఇంతలో తెరమీదికి వచ్చిన వివేకా రెండో భార్య,ముస్లిం వర్గానికి చెందిన షేక్ షమీమ్.. కూడా తెరమీదికి వచ్చారు.
తాజాగా ఆమె నుంచి సీబీఐ అధికారులు స్టేట్‌మెంటునురికార్డు చేశారు. దీంతో పాటు.. ఆమె సీబీఐకి మూడు పేజీల తన వాదనను రికార్డుగా అందించారు. అదేసమయంలో వివేకాకు సంబంధించిన ఆస్తులు, వ్యవహారాలు.. రాజకీయం.. కుటుంబ తగాదాలను కూడా షమీమ్ వ్యక్త పరిచారు. ఇక, సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో షమీమ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ స్టేట్‌మెంట్‌లో ప్రస్తుతం జైల్లో ఉన్న ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇక, వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను షమీమ్ వివరించారు.
2010 అక్టోబర్ 3న వివేకాతో తనకు బెంగళూరులో వివాహం జరిగిందని షమీమ్ వివరించారు. 2015లో తమకు షేహన్ షా(కొడుకు) జన్మించినట్టు స్పష్టం చేశారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రెడ్డి బెదిరించేదని.. అనేక సందర్భాల్లో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయని ఆమె వివరించారు. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా.. తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. బెంగళూరు భూ సెటిట్‌మెంట్‌లో 8 కోట్లు వస్తాయని వివేకా చెప్పినట్టు వివరించారు.
తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని షమీమ్ తెలిపారు, వివేకా కుటుంబ సభ్యులు మమ్మల్ని దూరం పెట్టారు. దీంతో నేను, నా కొడుకుతో బెంగళూరులోనే ఉండిపోయారు. షేహాన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తా అని వివేకా చెప్పేవారు. పలు మార్లు శివ ప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారు. ఆ కారణంగానే వివేకా చనిపోయాడని తెలిసినా రాలేకపోయాను. అన్యాయంగా వివేకా చెక్ పవర్‌ను తొలగించారు. మా అబ్బాయికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తామన్నారు. అక్కడే ఇల్లు కూడా కట్టిస్తమని చెప్పారు. అని షమీమ్ వివరించారు. దీంతో ఈ కేసు ఎటు మలుపుతిరుగుతుందోననే ఉత్కంఠ మరింత పెరిగింది.
This post was last modified on April 21, 2023 10:51 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…