టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కీలక దశకు చేరింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలోకి యాత్ర ప్రవేశించడంతో వెయ్యి కిలోమీటర్ల మైలు దాటినట్లయ్యింది. ప్రతీ వంద కిలోమీటర్లకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న లోకేష్.. వెయ్యి కిలోమీటర్లకు కూడా ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆదోని టౌన్ వార్డ్ 21 ని దత్తత తీసుకోవాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్‌ను ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను.
నియోజకవర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలు
ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై లోకేష్ ఒక రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అదోనిని ముంబైలా మార్చేస్తానని హామీ ఇచ్చి రెండు సార్లు గెలిచిన ఆయన నియోజకవర్గాన్ని అథోగతి పాలు చేశారన్నారు. ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు ముగ్గురూ ఎమ్మెల్యేల్లాగే పెత్తనం చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. నియోజకవర్గాన్ని కేకు ముక్కలా పంచుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు. కొడుక్కి భూకబ్జాలు, సెటిల్మెంట్లు, భార్యకు రిజిస్టర్ ఆఫిస్ బాధ్యతలు అప్పగించారని లోకేష్ వెల్లడించారు. ఆదోనిలో అభివృద్ధి నిల్లు…అవినీతి ఫుల్లు అని అంటూ.. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ కాదని, ఆయన క్యాష్ ప్రసాద్ అని వివరించారు.
సాయి ప్రసాద్‌కు ప్రతీ రోజు క్యాష్ లెక్కపెట్టుకోవడమే పనిగా మారిందన్నారు. కబ్జా చేసిన భూములతో కొత్త వెంచర్లు వేస్తున్నారన్నారు. క్యాష్ ప్రసాద్ కుమారుడు మనోజ్ రెడ్డి, ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ మండిగిరి కొండ, కొండాపురం కొండను మింగేశారన్నారు. ప్రజలకు సేవ చేసే ఎన్జీవోలను కూడా భయపెడుతున్నారన్నారు.
కర్ణాటక మద్యం విక్రయం
కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఎమ్మెల్యే వర్గీయులు ఆదోనిలో విక్రయిస్తున్నారన్నారు. అందులోంచి ఎమ్మెల్యేకు వాటా ఇవ్వాలన్నారు. పైగా నియోజకవర్గంలో బియ్యం మాఫియా కూడా నడుస్తోందని లోకేష్ అన్నారు. క్యాష్ ప్రసాద్ అవినీతితో బైపాస్ పనులు కూడా ఆగిపోయాయన్నారు.
లోకేష్ ఎక్కడికి వెళ్లినా అక్కడి ఎమ్మెల్యే అవినీతిని, అరాచకాలను బయటకు తీస్తున్నారు. ఆ క్రమంలో ఆదోనీ ఎమ్మెల్యే బాగోతాన్ని కూడా బట్టబయలు చేశారు.
This post was last modified on April 21, 2023 10:49 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…