సమాజంలో కొందరు వ్యక్తుల వ్యక్తిత్వం మీద మాట్లాడే విధానంపైన జనాల్లో ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్, సీబీఐ జేడీగా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ మీద కూడా జనాల్లో కచ్చితమైన అభిప్రాయాలుంటాయి. అలాంటిది వీళ్ళద్దరి కలిసి మీడియా సమావేశంలో పాల్గొనటమే చాలా విచిత్రంగా ఉంది. కేఏ పాల్ అంటే తెలుగురాజకీయాల్లో ఒక హస్యపాత్రగా జనాలు చూస్తున్నారు. నోటికేదొస్తే అది మాట్లాడేసే పాల్ తన చేష్టలతో జనాల దృష్టిలో చాలా చీపైపోయారు.
2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా నామినేషన్ వేసిన తర్వాత ప్రచారంలో రోడ్లపై పిచ్చి డ్యాన్సులు వేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా వేలు, లక్షల కోట్ల రూపాయల విరాళాలు తెచ్చేస్తానని చెబుతుంటారు. రెగ్యులర్ గా ఇలాంటి మాటలు మాట్లాడి మాట్లాడే జనాల్లో జోకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్యమధ్యలో లాజికల్ గా మాట్లాడినా జనాలు పట్టించుకోవటంలేదు.
ఇదే సమయంలో లక్ష్మీనారాయణంటే జనాల్లో మంచి రెస్పెక్టే ఉంది. ఐపీఎస్ ఉద్యోగం చేశారు కాబట్టి ఇంటలెక్చువల్ గా సమాజంలో గుర్తింపుంది. అలాంటి లక్ష్మీనారాయణ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగులో పాల్గొనేందుకు ప్రజల నుండి విరాళాలు అడగటంతోనే ఆయనపైన జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించి బిడ్డింగ్ వేసి స్టీల్ ప్లాంట్ ను కొనాలనేది ఈయన ఆలోచన. ఎంతమంది విరాళాలిస్తే రు. 5 వేల కోట్లు వచ్చేను ? తర్వాత నిర్వహణ ఖర్చులను ఎలా భరిస్తారు ?
ఇలాంటి మాటల వల్ల తనకున్న ఇమేజిని ఈయనే తగ్గించుకుంటున్నారు. అలాంటిది హఠాత్తుగా కేఏపాల్ తో కలిసి లక్ష్మీనారాయణ మీడియా ముందు ప్రత్యక్షమవటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇద్దరు కలిసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడారు. దాంతో పాల్ తో లక్ష్మీనారాయణ చేతులు కలిపారా అనే డౌటు పెరిగిపోతోంది. పాల్ తో కలవటంతోనే లక్ష్మీనారాయణ తన స్ధాయిని తానే దిగజార్చేసుకున్నారు. ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరి కొనేందుకు అమెరికా ఫండ్స్ తెస్తానని, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ కూడా ప్లాంట్ కొనేందుకు విరాళిచ్చేందుకు రెడీగా ఉన్నట్లు పాల్ చెప్పారు. అంటే విరాళాల సేకరణలోనే పాల్-లక్ష్మీనారాయణ ఏకమైనట్లు అర్ధమైపోతోంది .
This post was last modified on April 20, 2023 2:15 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…