గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమం ప్రభుత్వా కార్యాలయాలన్నింటికీ పార్టీ రంగులు వేయడం. ఐతే ముందు పంచాయితీ భవనాలతో మొదలైన రంగుల కార్యక్రమం.. ఆ తర్వాత అన్నింటికీ విస్తరించింది.
వాటర్ ట్యాంకర్లు.. బోర్లు.. స్కూళ్లు.. డివైడర్లు.. ఇలా దేన్నీ వదలకుండా కనిపించిన ప్రతి దానికీ వైకాపా రంగులేస్తూ పోయారు. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. చివరికి ఈ వ్యవహారం కోర్టుకెక్కింది.
హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసి.. వెంటనే రంగులు తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. రంగులు తొలగించడానికి మూడు నెలల గడువు ఇవ్వాలని కోరినా ఒప్పుకోని హైకోర్టు.. స్థానిక ఎన్నికల కంటే ముందే రంగులు తీసేయాల్సిందే అని స్పష్టం చేసింది.
ఐతే రంగులేయడానికి ఇప్పటికే రూ.1500 కోట్ల దాకా ఖర్చు చేసిన జగన్ సర్కారు.. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఈ సమయంలో మళ్లీ రంగుల తొలగింపు కోసం వందల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో లేదు. ఈ నేపథ్యంలో ఉన్న రంగుల్నే కొద్దిగా మార్చే ప్రయత్నం చేసింది. దీని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ కూడా ఉండటం గమనార్హం.
వైకాపా జెండా కలిసొచ్చేలా ఇంతకుముందు పచ్చ, తెలుపు, నీలి రంగులతో భవనాల్ని ముస్తాబు చేయగా.. అందులో అందులో కొంత మేర కాషాయ రంగు వేయడం ద్వారా మార్పు చూపించాలని చూస్తున్నారు. తద్వారా కోర్టుకు కొత్త రంగులేసినట్లు చూపించవచ్చు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని మెప్పించేలా ఆ పార్టీ రంగు వేసినట్లూ ఉంటుంది.
ఖర్చు తగ్గించుకోవడంతో పాటు కేంద్రాన్ని మెప్పించడం ద్వారా ఈ రంగుల గొడవ నుంచి బయటపడొచ్చని భావిస్తున్నట్లుంది. తెనాలిలో ఇలా మార్పు చూపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఐతే ఈ మార్పు విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
This post was last modified on April 23, 2020 5:40 pm
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…