Political News

బాబు, లోకేషే అంటూ పార్టీని ముంచేస్తోందెవ‌రు ?

పార్టీలో యాక్టివ్ గా ఉండాల‌ని.. దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని.. వ‌చ్చేఎన్నిక‌ల్లో పొత్తులు ఉన్నా.. లేకున్నా.. పార్టీ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యం ద‌క్కించుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌దే ప‌దే పార్టీ నేత‌ల‌కు చెబుతున్నారు. ఎక్క‌డ ఎప్పుడు మీటింగ్ పెట్టినా.. చంద్ర‌బాబు చేస్తున్న దిశానిర్దేశం.. తొలి ప‌లుకు కూడా ఇదే. అయితే.. దీనిని ఎంద‌రు అందిపుచ్చుకుంటున్నారు? ఎంత మంది బాబు చూపిన దారిలో ప్ర‌యాణం చేస్తున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. సుమారు 80 శాతం మంది టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టికీ నిస్తేజంలో ఉన్నారు. అంటే.. వారు ప్ర‌య‌త్నించ‌డ‌మే లేదు. అస‌లు కాలు కూడా బ‌య‌ట‌కు పెట్ట‌డం లేదు. ఎన్నిక‌లు వ‌చ్చాక చూద్దాంలే అనే ధోర‌ణిలోనే ఉన్నారు. నిజానికి ఎన్నిక‌ల‌కు మ‌రో 10 మాసాలు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. అలాంట ప్పుడు.. వీరు ఎందుకు ఇంత నిస్తేజంలో ఉన్నారు? అంటే.. రెండు ప్ర‌ధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు పరిశీల‌కులు.

1) అంతా చంద్ర‌బాబు చూసుకుంటారు. 2) పొత్తుల‌పై గంద‌ర‌గోళం. అయితే.. పొత్తుల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తొలి విష‌యం మాత్రం చాలా ఇబ్బందిక‌రంగా మారింది. అంతా చంద్ర‌బాబు, నారా లోకేష్ చూసుకుంటారు.. మా కెందుకు అనే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తే.. వ్య‌క్తిగ‌తంగా వారే న‌ష్ట‌పోయే ప్ర‌మాదంతో పాటు పార్టీకి కూడా ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టికెట్ వ‌చ్చినా రాకున్నా.. ప్ర‌జ‌ల్లో ఉంటే.. ఆ హ‌వా వేరుగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

కానీ, మెజారిటీ నాయ‌కులు చంద్ర‌బాబు వ‌స్తే.. క‌నిపిస్తున్నారు.ఆయ‌న అటు వెళ్ల‌గానే వీరు త‌మ వ్య‌వ‌హా రాల్లో మునిగిపోతున్నారు. ఫ‌లితంగా వీరు చంద్ర‌బాబు, నారా లోకేష్‌పై ఆధార‌ప‌డిన ప‌రాన్న జీవులా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక‌, పొత్తుల విష‌యాన్ని చూస్తే.. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వాస్త‌వానికి అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి పొత్తులు లేకుండా కూడా వెళ్లే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నారు. మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు క‌దులుతారా? లేదా? చూడాలి.

This post was last modified on April 18, 2023 9:51 pm

Share

Recent Posts

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

7 minutes ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

2 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

4 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago