వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఐదోసారి విచారణకు సీబీఐ పిలిచేసరికి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి హడలిపోయినట్టుగా ఉన్నారని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే.. ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సంచల న విషయాలు వెల్లడించారు. తాను అమాయకుడినని.. బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.
అంతేకాదు.. చంద్రబాబు-సీబీఐ అదికారి కుమ్మక్కయ్యారని అవినాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ నాలుగు సార్లు విచారించి వాంగ్మూలం నమోదు చేసిందని ఆయన తెలిపారు. నిందితుడి గా చేర్చే అవకాశం ఉందని గతంలో హైకోర్టులో సీబీఐ చెప్పిందని.. ఇప్పుడు అరెస్టు చేసే ఉద్దేశంతో ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి వెల్లడించారు.
దస్తగిరి వాంగ్మూలం మేరకు ఇరికించాలని సీబీఐ చూస్తోందని ఆరోపణలు చేశారు. ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను సీబీఐ తెరపైకి తెచ్చిందని విమర్శించారు. దర్యాప్తులో గూగుల్ టేకవుట్ కచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానం కాదని.. వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదని అవినాష్ అన్నారు. నాలుగు సంవత్సరాలలో అనేక పరిణామాల తర్వాత తనని లక్ష్యంగా చేశారని అవినాష్ ఆరోపించారు.
ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముందస్తు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టును కోరిన అవినాష్.. పిటిషన్‌పై విచారణ తేలేవరకు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఒకవేళ అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు
వివేకా తిరుగుబోతు!
దివంగత వివేకానంద రెడ్డి తిరుగుబోతు అని పిటిషన్‌లో ఎంపీఅవినాష్ రెడ్డి పేర్కొన్నారు. వివేకాకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలిపారు. రెండో వివాహం ముస్లిం మహిళతో జరిగిందని.. ఆమెకు కొడుకు కూడా పుట్టాడని తెలిపారు. అదేసమయంలో వేరే మహిళతోనూ వివేకా సంబంధం పెట్టుకున్నాడని వారంతా కలిసి చంపి ఉంటారని అనుమానం ఉందని ఎంపీ తన పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం.
This post was last modified on April 17, 2023 4:31 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…