Political News

కర్నాటకలో లేటెస్ట్ సర్వేనే నిజమవుతుందా ?

కర్నాటక ఎన్నికలు చాలా హోరా హోరీగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అధికార బీజేపీ మీద జనాల్లో బాగా వ్యతిరేకత కనబడుతోంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మీద జనాల్లో బ్రహ్మాండమనేంతగా సానుకూలత కనబడటంలేదట. కాబట్టి మధ్యలో ఉన్న జేడీఎస్ కీలకపాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆమధ్య జరిగిన ఒక సర్వేలో 224 అసెంబ్లీల్లో కాంగ్రెస్ కు 127 సీట్లు వస్తాయని తేలింది.

అయితే తాజాగా పీపుల్స్ పల్స్ సంస్ధ నిర్వహించిన సర్వేలో ఏ పార్టీకి కూడా కంఫర్టబుల్ మెజారిటి రాదని తేలిందట. ప్రాపబులిటి ప్రొఫెషనల్ మెథడాలజీ పద్దతిలో 56 నియోజకవర్గాల్లో సర్వే చేసింది. పై నియోజకవర్గాల్లో 5600 శాంపుల్స్ సేకరించింది. కోట్లమంది ఓటర్లున్న రాష్ట్రంలో 5600 శాంపుల్సంటే చాలా తక్కువనే చెప్పాలి. 56 నియోజకవర్గాల్లో 5600 మందిని సర్వేచేశారంటే నియోజకవర్గానికి 100 మందని అర్ధమవుతోంది.

ఇలాంటి సర్వేల వల్ల ఫలితాలు సక్రమంగా వస్తాయని అనుకునేందుకు లేదుకానీ ఓవరాలుగా జనాల నాడి ఎలాగుంది అని చెప్పుకునేందుకు పనికొస్తుందంతే. ఈ పద్దతిలో చూస్తే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటి రాదని అర్ధమవుతోంది. 224 నియోజకవర్గాలున్న కర్నాటకలో ఏ పార్టీ అయినా సొంతంగా అధికారంలోకి రావాలంటే 113 సీట్ల మ్యాజిక్ మార్కును దాటాలి. ఈ లెక్కన కాంగ్రెస్ కు 95-105 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

అలాగే బీజేపీకి 90-100 స్ధానాలు వస్తాయట. జేడీఎస్ కు 25-30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయట. నిజంగానే ఈ సర్వే వాస్తవమైతే కర్నాటకలో 2018లో వచ్చినట్లు మళ్ళీ హంగ్ రావటం ఖాయం. అదే జరిగితే కుమారస్వామే మళ్ళీ ముఖ్యమంత్రయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. తనకు సంపూర్ణ మెజారిటి రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఇదే సమయంలో హంగ్ అసెంబ్లీ రావాలని బహుశా కుమారస్వామి కోరుకుంటున్నారేమో. మొత్తంమీద పాలక బీజేపీ పరిస్ధితే అన్యాయంగా తయారైంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలు అభ్యర్ధుల ఎంపికలో హిట్ అవుట్ ఆర్ గెటవుట్ అనే పద్దతిలో ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on April 14, 2023 1:40 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అదే .. మా నాన్నకు రేవంత్ ఇచ్చిన గిఫ్ట్

'కొండ'ను పిండి చేస్తాం. చేవెళ్లలో గెలవనివ్వం అని రేవంత్ రెడ్డి అనడం డ్రామా. కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ పీసీసీ చీఫ్…

33 mins ago

ఒక్క నిర్ణయం 5 సినిమాలకు ఇబ్బంది

నిన్న హఠాత్తుగా ప్రకటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదా ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్…

1 hour ago

కాంగ్రెస్ లో కల్లోలం రేపిన రాహుల్ సభ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 స్థానాలు…

2 hours ago

59 నెంబర్ మీద చరణ్ అభిమానుల కోపం

అదేంటి ఒక సంఖ్య మీద హీరో ఫ్యాన్స్ కి కోపం రావడం ఏమిటనుకుంటున్నారా. దానికి సహేతుకమైన కారణమే ఉంది లెండి.…

2 hours ago

జగన్ వన్ సైడ్ లవ్

కేసులు కావొచ్చు ఇత‌ర స్వార్థ ప్ర‌యోజ‌నాలు కావొచ్చు ఇన్నేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి స‌ర్కారుకు, ప్ర‌ధాని మోడీకి ఏపీ సీఎం…

3 hours ago

అంతుచిక్కని కల్కి ప్రమోషన్ ప్లాన్లు

టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియాలోనే అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న కల్కి 2898 ఏడి విడుదలకు అట్టే సమయం…

3 hours ago