వైసీపీ సర్కారుపై తరచుగా విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా ఇంటింటికీ స్టిక్క ర్ల పథకంపై తనదైన శైలిలో సటైర్లు గుప్పించారు. విశాఖ పట్నంలోని రుషి కొండ అక్రమతవ్వాలపై వైసీపీ సర్కారు ఇరుకునపడిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ.. పవన్.. `ఆ రుషికొండ అక్రమాల ను కప్పి పుచ్చుకునేందుకు అక్కడ 151 అడుగుల స్టిక్కర్ వేయండి“ అని వ్యాఖ్యానించారు. చేసినా చేస్తారని.. అక్రమాలు కప్పించుకునేందుకు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు.
చెట్లు, కొండలను నరికివేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం అనేది వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణమని పవన్ విమర్శించారు. రిషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా లేక రిషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అని పవన్ నిలదీశారు.
ఇదిలావుంటే.. మా నమ్మకం నువ్వే జగన్
కార్యక్రమం కింద.. ఇంటింటికీ స్టిక్కర్‌లు అంటించే కార్యక్రమం పై పవన్ వరుసగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. బలవంతంగా రుద్దుతున్నారని.. ఒక వ్యక్తిని బలవం తంగా ఒప్పించడం.. వారిపై బలమైన ఇష్టాన్ని ప్రయోగించడం వంటివి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. స్వేచ్ఛ అనేది లేకుండా చేసి.. చేతులు కట్టేసి ఓటు వేయించుకునేందుకు వైసీపీ తెగబడుతుండడంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
This post was last modified on April 14, 2023 1:23 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…