కాంగ్రెస్ నేత, నిర్మల్ మాజీ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. రెండు రోజులుగా మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న తరుణంలోనే ఆయనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాస్ నోటీసులు ఇవ్వడం.. దానికి ఆయన తీవ్రంగా స్పందించడంతో ఆ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీపీసీసీ ఇచ్చిన నోటీసులపై ఏలేటి రెట్టింపు స్థాయిలో ఫైర్ కావడం చర్చనీయాంశమవుతుంది. ఆయన పార్టీ మారడం ఖాయమని.. బీజేపీతో అంతా మాట్లాడుకున్నారని చెప్తున్నారు. ఆయన చేరిక విషయమై దిల్లీ పెద్దలతో ఈటల రాజేందర్, బండి సంజయ్ చర్చిస్తున్నారని చెప్తున్నారు.
మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తుండడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరి మధ్య ఏమాత్రం పొసగని పరిస్థితది. ఆయన కూడా అందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ ను టీపీసీసీ అధ్యక్షుడిగా కావాలని కోరుకున్న తొలి వ్యక్తిని తానేనని కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తనను పార్టీ నుంచి దూరం చేయాలని వ్యూహాత్మకంగా ఆయనే పావులు కదుపుతున్నాడని మహేశ్వర్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది.
మహేశ్వర్ రెడ్డి ఒకట్రెండ రోజుల్లొ దిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలవనున్నట్లు అనుచరులు చెప్తున్నారు. అయితే, ఆయన బీజీపీ నేతలను కలవడానికి ముందు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు వీలైతే రాహుల్ గాంధీని కలిసి రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేయనున్నారని సమాచారం.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీలో చేరికల వ్యవహారం చూస్తున్న ఈటెల రాజేందర్‌తో మహేశ్వర్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికీ మహేశ్వర్ రెడ్డి మిత్రుడే. బండి సంజయ్‌తో గొప్ప సంబంధాలు లేకపోయినా ఎలాంటి విభేధాలు లేవు. కాగా ఈటల, బండి ఇప్పటికే ఢిల్లీ వెళ్లడంతో మహేశ్వర్ రెడ్డి విషయంలోనే వారు దిల్లీ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది.
This post was last modified on April 13, 2023 4:12 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…