ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. తెలంగాణ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ‘మీ మామతో కలిసి కల్లు తాగి.. ఒళ్లు కొవ్వెక్కిందా?’ అని ప్రశ్నించారు. అంతేకాదు.. కవితకు ఉన్నట్టు.. ఏపీలో ఎవరికీ లిక్కర్ మాఫియాలతో సంబంధం లేదన్నారు. విషయం ఏంటంటే.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు.. కేంద్రం రెడీ అయిన దరిమిలా.. దీనిని సొంతం చేసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు.
దీనికి సంబంధించి మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సీదిరి ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే..
“హరీష్ రావు కూడా.. తన మామ కేసీఆర్‌తో కలిసి ఫాం హౌస్‌లో కూర్చుని కల్లు తాగాడా? అని అనిపించింది నాకు. కల్లు తాగిన కోతిలాగా.. ఒళ్లు కొవ్వెక్కి.. హరీష్ రావు మాట్టాడాతా ఉన్నాడు. మీ మామ లాగా..ఫామ్ హౌస్ లో కూర్చుని కల్లు తాగడం లేదిక్కడ. లేకపోతే.. పాపం కవితక్కలాగా… అలాంటి చాట్ లు కూడా లేవు మా దగ్గర. లిక్కర్ స్కామ్‌లు కూడా లేవు. మాట్లాడే ముందు .. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హరిష్ రావును కొరుతున్నా” అని వ్యాఖ్యానించారు.
ప్రాంతీయ ఉగ్రవాదులు
“సిగ్గు ఎగ్గు లేకుండా.. విశాఖను ప్రైవేటీకరిస్తే.. బిడ్ వేస్తామని చెబుతున్నావ్. మీరు అసలు ప్రైవేటీకరణకు అనుకూలమా.. వ్యతిరేకమా.. ” అని నిలదీశారు. ఇక, బంగారు తెలంగాణ అంటూ.. సాధించారు కదా.. కానీ, దొరల పాలన తీసుకువచ్చారని విమర్శించారు. “నువ్వు మంత్రివి, నీ మామగారు ముఖ్యమంత్రి.. ఆయనకో కొడుకు ఆయనో మంత్రి.. తెలంగాణ మీ జాగీరా? మీరు ప్రాంతీయ ఉగ్రవాదులు.. నువ్వు.. మీ మావ..మీ మామ కొడుకు, మీ మామ కూతురు అందరూ ప్రాతీయ ఉగ్రవాదులు. పనికిమాలిన మాటలు ఆపి.. మీ పని మీరు చేసుకోండి. మా ఆంధ్రా వాళ్లు తెలంగాణ రావడం ఆపేస్తే.. అక్కడ తినేందుకు కూడా ఏమీ ఉండదు. తెలంగాణ వాళ్లు బుర్రతక్కువ వాళ్లు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on April 13, 2023 3:58 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…