ఏపీలో ప్రధాన పార్టీల మధ్య స్టిక్కర్ల యుద్ధం భీకరంగా సాగుతోంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మధ్య స్టిక్కర్ల కార్యక్రమం కొత్త యుద్ధాన్ని తలిపిస్తోంది. వాస్తవానికి ఇంటింటికీ స్టిక్కర్లు అనే కార్యక్రమాన్ని మొదట ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డే మొదలుపెట్టారు. గడప గడపకు వైయస్సార్, మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్ నువ్వే జగనన్న అనే నినాదాలతో గత కొంతకాలంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు ఆయా నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటించి స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గత నెల 16వ తేదీ నుండి మరింత వేగవంతం చేశారు. గత ఏడాది మే 11వ తేదీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలోనే స్టిక్కర్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. వంద రోజులు కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న కొంత మంది నేతలు తమ నియోజకవర్గాల్లో ఇంటంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ స్టిక్కర్లు అంటిస్తూ వస్తున్నారు.
దీనికి పోటీగా జనసేన కూడా హడావుడి లేకుండా స్టిక్కర్ల కార్యక్రమం ఒకటి మొదలుపెట్టింది. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ స్టిక్కర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాజాగా తెలుగుదేశం కూడా సైకో పోవాలి .. సైకిల్ రావాలి.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి అనే నినాదాలతో స్టిక్కర్లు తయారుచేసి ఇంటింటికీ అంటించే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీల మధ్య స్టిక్కర్ల రాజకీయం ఊపందుకున్నట్లయింది. రాజకీయ రాజధాని బెజవాడలో టీడీపీ ఈకార్యక్రమాన్ని మరింత సవాల్‌గా తీసుకుంది. వైసీపీ అంటించిన స్టిక్కర్లకు పక్కనే టీడీపీ స్టిక్కర్‌ను కూడా అంటిస్తుండటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది.
ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రమవుతోందన్న నిఘా వర్గాల సమాచారంతో వైసీపీ ఎమ్మెల్యేలు రోజుకు 8 గంటలు ప్రజల్లోనే ఉండాలని ఆ పార్టీ పెద్దలు సూచిస్తున్నారు. పైకి చెప్పకపోయినా టీడీపీ కూడా ఇదే విధానం అమలు చేస్తోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్ నేతలు రోజుకు 10 గంటలు ప్రజల్లో ఉండాలని చంద్రబాబు నుంచి సూచనలు వెళ్లాయి ఇప్పటికే. అయితే.. వైసీపీ తరహాలో టీడీపీ, జనసేనలకు ప్రత్యేక కార్యక్రమాలేవీ పార్టీ అధిష్ఠానం నుంచి డిజైన్ కాకపోవడంతో స్థానిక నేతలు వైసీపీకి కౌంటరుగా స్టిక్కర్ల ప్రచారం చేస్తున్నారు. తమతమ నేతల ఫొటోలతో స్టిక్కర్లు తయారుచేయించి కాబోయే సీఎం అని వేస్తున్నారు.
తిరుగుబాట్లతో వైసీపీ తలకిందులవుతున్న నెల్లూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన నేతలు ‘పవనే సీఎం’ అంటూ స్టిక్కర్లతో ప్రచారం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాలలో టీడీపీ నేతలూ ఇలాంటి ప్రచారమే ఎత్తుకున్నారు. దీంతో ఏపీలో గోడలన్నీ మూడు పార్టీల స్కిక్లర్లతో కనిపిస్తున్నాయి.
This post was last modified on April 13, 2023 2:36 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…