రాజకీయంగా పేరున్న కుటుంబాలకు చెందిన కొందరు నిత్యం ప్రజాజీవితంలో బిజీబిజీగా ఉంటూ.. క్రియాశీల రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అందుకు భిన్నంగా కొద్ది మంది మాత్రం భిన్నంగా ఉంటారు. ఆ కోవలోకే వస్తారు నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి రామక్రిష్ణ. కామ్ గా ఉండటం.. రాజకీయాల గురించి అట్టే మాట్లాడకపోవటం.. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో ముందుండే ఆయన.. చాలా అరుదుగా మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడతారు.అలాంటి ఆయన తాజాగా తన తీరుకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడాలికి రాజకీయ భిక్ష పెట్టిందే నందమూరి వంశమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ సొంతూరు పామర్రు మండలం నిమ్మకూరుకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు అన్యాయం చేశారని కొడాలి నాని పదే పదే అంటున్నారన్న మాటకు బదులిస్తూ.. ‘ఎవరు ఎవరిని మోసం చేశారో అతని ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీని వాడుకుని అతడే నందమూరి కుటుంబాన్ని మోసం చేశాడు’’ అని బదులిచ్చారు.
ఈ తరహా వ్యాఖ్యలు నందమూరి రామక్రిష్ణ నోటి నుంచి ఇదే తొలిసారిగా చెప్పాలి. అంతేకాదు..రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం డెవలప్ మెంట్ లో 40 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. అడుక్కోవటానికి చిప్ప కూడా దొరకని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడి చేతికి పాలనా పగ్గాలు అందాలన్నారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసే కొడాలి నాని.. తాజాగా నందమూరి ఎన్టీఆర్ కుమారుడే తనపై చేసిన వ్యాఖ్యలకు ఆయన ఏ రీతిలోరియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on April 13, 2023 10:13 am
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…