ఆల్రెడీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో అత్యున్నత పదవిలోనే ఉన్నాడు కదా.. కొత్తగా రేవంత్ రెడ్డికి ఏం ప్రమోషన్ వచ్చింది అని ఆశ్చర్యం కలుగుతోందా? ఐతే ఈ ప్రమోషన్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణానికి సంబంధించింది కాదు. ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడ్డది. చూడ్డానికి ఇంకా పెద్ద వయసేమీ కానట్లు కనిపించే రేవంత్.. అప్పుడు తాత అయిపోయాడు.
కొన్నేళ్ల కిందటే పెళ్లి చేసుకున్న రేవంత్ ముద్దుల కూతురు నైమిష.. తాజాగా బిడ్డను ప్రసవించింది. తాను తాత అయిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా రేవంత్ స్వయంగా వెల్లడించాడు. నైమిషకు మగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను లాలిస్తున్న ఫొటోను రేవంత్ సోషల్ మీడియాలో ఫాలోవర్లతో పంచుకున్నాడు. “మా కుటుంబంలోకి మనవడు వచ్చాడని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. నా చిన్నారి నైమిష.. గత వారం మగ బిడ్డను ప్రసవించింది. తల్లీ బిడ్డలకు మీ అందరి ఆశీస్సులు కావాలి” అని రేవంత్ పేర్కొన్నాడు.
రేవంత్ 2016లో తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో నైమిషకు పెళ్లయింది. కూతురి పెళ్లి సమయంలో రేవంత్ రాజకీయంగా కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. ఓటుకు నోటు కేసు అప్పుడే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
This post was last modified on April 10, 2023 2:22 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…