టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలకు కౌంటర్‌గా ఆయన కూడా.. వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇలా.. గత ఏడాది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ప్రారంభించింది. అంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా.. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు వినడం.. ఈ కార్యక్రమం లక్ష్యం.
అదేసమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను కూడా వారికి వివరించాలి. దీంతో ఇది పెద్ద ఎత్తు న వైసీపీకి మేలు చేస్తుందనే చర్చ తెరమీదికి వచ్చింది. దీంతో అలెర్ట్ అయిన.. టీడీపీ అధినేత చంద్రబాబు.. వెంటనే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం తాము కూడా చేపడుతున్నామంటూ.. ప్రకటించారు. అంతేకాదు.. ప్రాంతీయ సమన్వయ కర్తలతో పెద్ద ఎత్తున వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించారు.
ఇంటింటికీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చెప్పారు. అంతేకాదు.. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్లాన్ కూడా చేసుకున్నారు. ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలో కూడా మ్యాప్ రెడీ చేసుకున్నారు. కానీ, ఈ కార్యక్రమం ఎందుకో మరుగున పడింది. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే.. చేతులు కాలిని తర్వాత.. అన్నట్టుగా.. వైసీపీ నేతలు మరో కార్యక్రమం చేపట్టి.. శుక్రవారం దుమ్ము రేపారు. మా నమ్మకం నువ్వే జగనన్నా.. అనే కార్యక్రమం పెద్ద ఎత్తున హిట్ కొట్టింది.
దీంతో ఇలాంటి కార్యక్రమం మనం కూడా చేస్తే.. బాగుండేది కదా.. ఎంత సేపూ మీడియా ముందు మాట్టాడితే.. ఏం ప్రయోజనం.. అనే మాట వినిపించింది. ఈ క్రమంలోనే గతాన్ని తవ్వుకున్న తమ్ముళ్లకు.. ఇప్పుడు పాత గుర్తులు జ్ఞాపకం వచ్చాయి. మరి ఇలా.. అయితే.. పార్టీ పరిస్తితి ఏంటి? అనేది చర్చ. పోనీ.. ఆ కార్యక్రమం ఎందుకు చేపట్టలేదో కూడా.. ఇప్పటిక ఈక్లారిటీ లేకపోవడం గమనార్హం.
This post was last modified on April 10, 2023 8:35 am
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…