టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏదో ఒక వివాదం తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ సర్కారుకు సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. ఇటీవల రెండు రోజుల కిందట మూ డు జిల్లాల పర్యటనను చంద్రబాబు ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, నేతల జోనల్ సమావేశాలను ఆయన చేపట్టారు. తద్వారా.. పార్టీని బలోపేతం చేయడంతోపాటు..నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇదేసమయంలో తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో టీడీపీ హయాంలో చేపట్టిన కీలకపథకాలు… పనులకు సంబంధించి.. సెల్ఫీలు దిగుతున్నారు చంద్రబాబు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. విశాఖలో ఐటీ పార్కు వద్ద.. సెల్ఫీదిగిన చంద్రబాబు .. తమ హయాంలో ఐటీ పరుగులు పెట్టిందని.. ఇప్పుడు పరిస్థితి ఏంటని సీఎం జగన్‌ను ప్రశ్నించారు.
అదేవిధంగా నెల్లూరులో పర్యటించిన చంద్రబాబు.. తాను సీఎంగా ఉన్నప్పుడు.. పేదలకు.. టిడ్కో ఇళ్లు కట్టించామని.. ఇవి పూర్తయ్యే దశలో ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో తాము ఓడిపోయాని అంగీకరించారు. మరి ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లు ఎందుకు పేదలకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తమ హయాంలో నే 85 శాతం పూర్తయ్యాయని మిగిలిన 15 శాతం కూడా పూర్తి చేయలేరా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీడ్కో ఇళ్ల ముందు చంద్రబాబు సెల్ఫీ తీసుకున్నారు.
దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. అయితే.. టీడీపీ అధినేత సెల్ఫీ చాలెంజ్‌లపై ఆచితూచి స్పందించారు వైసీపీ మంత్రులు. నెల్లూరుకు చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్.. టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు. సెల్ఫీలుకాదని.. నేరుగా తమతో చర్చలకు వస్తే.. లెక్కలు చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఇక, దీనిపై టీడీపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇలా.. మొత్తంగా.. సెల్ఫీల విషయం ఇరు పార్టీల మధ్య వివాదంగా మారడం గమనార్హం.
This post was last modified on %s = human-readable time difference 8:31 am
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంతరం భారత…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…