మహిళల దుస్తులు.. వారి వ్యవహారశైలిపై బీజేపీ నేత ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒళ్లంతా కనిపించేలా బట్టలు కనిపించేవా రు.. శూర్పణఖలతో సమానమని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అలాంటి వారిని అక్కడే.. నడిరోడ్డుపై కొట్టినా తప్పులేదనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. దీనిపై మహిళా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మంచి దుస్తులు ధరించని మహిళలు శూర్పణఖల్లాంటి వారని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ వ్యాఖ్యానించారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విజయవర్గీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్నప్పుడు మద్యం మత్తులో ఉన్న యువతను, పిల్లల్ని చూస్తుంటాను. చాలా అలగా చేస్తున్నారని అనిపిస్తుంది. వాళ్లను అలగా జనం అంటే తప్పులేదు. అంతేకాదు.. నాకు చచ్చే కోపం వస్తుంది. కారు దిగి వారిని అక్కడే కొట్టాలని అనిపిస్తుంది” అని వర్గీయ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. “మహిళల్లో మనం దేవతలను చూస్తుంటాం. మరి, మంచి దుస్తులు వేసుకోని బాలికలు దేవతల్లా కారు.. శూర్పణఖల్లా కనిపిస్తారు. దేవుడు ఆడవాళ్లకు అందమైన శరీరం ఇచ్చాడు. మంచి దుస్తులు ధరించండి. ఒళ్లంతా కనిపించేలా షార్ట్స్ వేసుకోమని ఎవరు చెప్పారు. తర్వాత ఏమైనా అయితే.. ప్రభుత్వాలపై పడి ఏడుస్తారు” అని వ్యాఖ్యానించారు. ఇక, వర్గీయ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరచడేమనని ప్రతిపక్షాలు విమర్శించాయి. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెటా డిసౌజా స్పందిస్తూ తాలిబన్ పాలనలో ఉన్నట్టు అనిపిస్తోందని విమర్శించారు. ఏమి తినాలో, ఎలాంటి దస్తులు వేసుకోవాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందా అని ప్రశ్నించారు. ఇరాన్ లో తాలిబాన్ల ఆంక్షలపై ఆశ్చర్యం వ్యక్తం చేశామని..కానీ, ఇప్పుడు ఇక్కడ అవే ఆంక్షలు కనిపిస్తున్నాయని అన్నారు.
This post was last modified on April 9, 2023 2:44 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…