జీవితకాలం ఎంతో ఉన్నతంగా బతికి.. తమిళనాడును శాసించిన దివంగత ముఖ్యమంత్రి.. అన్నాడీఎంకే నేతల అమ్మ.. జయలలిత.. చివరి దశలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని..జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. పురుచ్చితలైవిగా.. పేర్గాంచి.. బతికి ఉన్నప్పుడే.. ఆలయాలు కట్టించుకునేంత ఎత్తుకు ఎదిగిన జయ జీవితంలో అన్నీ సస్పెన్సులే! వివాహం.. పిల్ల(లు).. ప్రేమాయణం.. అవినీతి… ఆఖరుకు మరణం కూడా.. అంతా మిస్టరీగానే ముగిశాయి.
ఇక, ఆమె జీవితంలో కీలక మలుపుగా మారి… జైలుకు వెళ్లే దుస్థితిని కల్పించిన అవినీతి అంతా ఇంతా కాదు. అప్పట్లో జయ అక్రమార్జన గురించి.. పేపర్లు ప్రత్యేక ఎడిషన్లు వేసిన సందర్భాలు ఉన్నాయంటే.. ఆశ్చర్యం అనిపించకమానదు. ఈ కేసును ప్రభావితం చేస్తున్నారంటూ.. ఏకంగా.. తమిళనాడు రాష్ట్రం నుంచి కర్ణాటకకు తరలించారు. ఇక్కడే జయ కేసులో తీర్పురావడం.. ఆమె జైలుకు కూడా వెళ్లడం తెలిసిందే.
అయితే.. అక్రమార్జన కేసులో జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తుల్ని విక్రయించేందుకు కర్ణాటక ప్రభుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించి లావాదేవీలు చేసేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది కిరణ్ ఎస్ జావలిని బొమ్మై ప్రభుత్వం నియమించింది. సాక్ష్యాల రూపంలో 1996లో చెన్నైలోని జయ నివాసం నుంచి స్వాధీనపరచుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక సర్కారు ఆధీనంలో ఉన్నాయి. మరి వీటిని కొనుగోలు చేయాలని భావించేవారు.. ప్రత్యేక ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని.. వేలంలో పాల్గొనవచ్చు.
వేలం వేసే జయ అక్రమార్జన ఇదీ..
This post was last modified on April 9, 2023 10:59 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…