ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు కోపం వచ్చింది. సమస్యల మీద సమస్యలు చెబుతున్న సొంత పార్టీకి చెందిన చోటా నేత మీద విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే తీరు మీద కంప్లైంట్ చేస్తున్న ఆయన్ను వారించగా.. తాను చెప్పాల్సిన విషయాల్ని చెబుతున్న వైనం ఆయనకు పట్టలేనంత కోపాన్ని కలిగేలా చేసింది. దీంతో.. ఆయన సీరియస్ అయ్యారు. “పార్టీలో ఉంటే ఉండు లేకపోతే బయటకు పో. ఏం మాట్లాడుతున్నావు? బాధలా.. ఏంటి నీ బాధలు. నీకేనా? మాకు లేవా బాధలు? ఇక్కడ బాగా క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోయింది. నువ్వే పోటుగాడివా? వీళ్లందరికి చేతగాదనుకున్నావా రాజకీయం చేయటం?” అంటూ ఫైర్ అయ్యారు.
ఇంతకూ మంత్రి బొత్సకు ఎందుకంత కోపం వచ్చింది? అసలే జరిగిందన్న విషయంలోకి వెళితే.. విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గం ప్రధాన కేంద్రంలో జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి బొత్స హాజరయ్యారు. ప్రోగ్రాం అయ్యాక తిరిగి వెళుతున్న ఆయన వద్దకు పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ రెహ్మాన్ వెళ్లారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేసి.. ఓడించినోళ్లకు పదవులు వచ్చాయి. వారిప్పుడు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇలా చేస్తే.. పార్టీకి మొదట్నించి ఉండి.. పార్టీని నమ్ముకున్న మాలాంటోళ్ల పరిస్థితేంటి? అలాంటోళ్ల కారణంగా నియోజకవర్గంలో చాలా బాధలు పడుతున్నామని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజుపై మంత్రి బొత్సకు కంప్లైంట్ చేశారు.
ఆ సమయంలో ఎమ్మెల్యే కడుబండి సదరు నేత పక్కనే ఉన్నారు. ఇలాంటివి మాట్లాడటానికి ఇది టైం కాదు.. విజయనగరం వచ్చి మాట్లాడాలని చెప్పారు. ఇదే సమయంలో రహమాన్ ఇంకేదో చెప్పబోతుంటే.. సీరియస్ అయిన మంత్రి బొత్స.. “ఉంటే పార్టీలో ఉండు.. లేదంటే లేదు” అంటూ అందరి ముందు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో రహమాన్ కు బిత్తరపోయిన పరిస్థితి. అయితే.. అందరి ముందు ఎమ్మెల్సీ గురించి తనకు కంప్లైంట్ చేయటం సరి కాదన్నది బొత్స భావన అయితే.. అందరిముందు పార్టీ నేతను పట్టుకొని అంతలా అనేయటం సరైనదా? అంటూ మంత్రి తీరును పలువురు తప్పు పడుతున్నారు.
This post was last modified on April 9, 2023 10:48 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…