ఒక్క తప్పటడుగు వల్ల జనాలు, పార్టీలోనే కాకుండా చివరకు కుటుంబంతో కూడా విభేదాలు వచ్చేశాయి. వైసీపీ ఎంఎల్ఏగా ఉంటు క్రాస్ ఓటింగ్ ద్వారా టీడీపీ ఎంఎల్సీ అభ్యర్ధి గెలుపుకు సహకరించారని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖరరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. క్రాస్ ఓటింగ్ కారణంగా ముందు పార్టీకి తర్వాత జనాలకు కూడా దూరమయ్యారు. తాజాగా కుటుంబానికి కూడా ఎంఎల్ఏ దూరమైపోయినట్లు సమాచారం.
ఇదే విషయమై మాజీ ఎంపీ, చంద్రశేఖరరెడ్డి అన్న మేకపాటి రాజగోపాలరెడ్డి మీడియాతో మాట్లాడుతు తన తమ్ముడిని దూరంపెట్టేసినట్లు చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేసి పార్టీనుండి సస్పెండ్ అయినప్పటినుండి తన తమ్ముడితో మాటలు లేవన్నారు. దారితప్పిన దగ్గరనుండి ఎంఎల్ఏతో మాట్లాడటం లేదని మాజీ ఎంపి చెప్పారు. పార్టీలైను దాటి క్రాస్ ఓటింగ్ చేయటం ముమ్మాటకి తన తమ్ముడు చేసింది తప్పే అన్నారు. క్రాస్ ఓటింగ్ చేయలేదని తమ్ముడు ఎంతచెప్పినా చెల్లుబాటు కాదన్నారు.
ఒక ఎంఎల్ఏని సస్పెండ్ చేశారంటే ఊరికే చేయరు కదా అని మాజీ ఎంపీ ఎదురు ప్రశ్నించారు. క్రాస్ ఓటింగ్ విషయంపై అంతర్గతంగా విచారణ చేసుకుని, నిర్ధారించుకున్న తర్వాతనే వేటు వేసినట్లు స్పష్టంచేశారు. తమ్ముడైనా ఎవరైనా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టబడుండాల్సిందే అని రాజగోపాలరెడ్డి స్పష్టంగా చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేయలేదని ప్రమాణం చేస్తానని ఎంఎల్ఏ చెప్పటంలో అర్ధంలేదని అన్న అభిప్రాయపడ్డారు.
ఎంఎల్ఏ తీరుతో ప్రమాణాలకు కూడా విలువ లేకుండా పోయిందని బాధపడ్డారు. నియోజకవర్గంలో ఎవరు పోటీచేస్తారనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారమే జరుగుతుందన్నారు. అభ్యర్ధిగా జగన్ ఎవరిని ఎంపికచేసినా సంతోషమే అన్నారు. వచ్చేఎన్నికల్లో కూడా పోయిన ఎన్నికల్లో లాగే అన్నీ నియోజకవర్గాల్లోను వైసీపీనే గెలుస్తుందన్న ధీమాను వ్యక్తంచేశారు. మొత్తానికి ఎప్పటినుండి అన్నదమ్ముల మధ్య గొడవలను సెటిల్ చేసుకునేందుకు క్రాస్ ఓటింగ్ మంచి అవకాశం కల్పించినట్లే ఉంది. తమ్ముడి వైఖరితో విసిగిపోయిన అన్న కుటుంబం చాలాకాలంగా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అలాంటిది క్రాస్ ఓటింగ్ పుణ్యమాని పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్లున్నారు.
This post was last modified on April 8, 2023 11:27 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…