Political News

బీజేపీ సీమ గేమ్…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలి కాషాయ కండువా కప్పుకున్నారు. కొద్ది గంటల వ్యవధిలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకుని రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వెళ్లిపోయే నేతలంతా చేసే పనే కిరణ్ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీపై టన్నుల కొద్ది బురద చల్లి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ తమ నాయకులను ఏ మాత్రం పట్టించుకోదని, వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వదని కిరణ్ ఆరోపించారు. ప్రజలతో మాట్లాడని పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలను కోల్పోతుండగా, యువత ఆదరణ పొందుతున్న బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటోందన్నారు..

రుద్రరాజు ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు ఖడించారు. అన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలి కిరణ్ బీజేపీలోకి వెళ్లారని అంటూ.. హస్తం పార్టీని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. త్యాగాలకు మారుపేరైన కాంగ్రెస్ ను విమర్శించే హక్కు కిరణ్ కు లేదన్నారు..

సీమలో బలోపేతమే లక్ష్యంగా..

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కోస్తా జిల్లాల నాయకుడు. గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, గుంటూరు జిల్లా నేత. పార్టీ కేడర్ కూడా కోస్తాలోనే ఎక్కువగా ఉంది. పైగా విష్ణు వర్థన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి లాంటి ఒక్కరిద్దరు తప్పితే పార్టీలో రెడ్డి సామాజిక వర్గం నేతలు పెద్దగా లేరు. వైసీపీ మాత్రమే రెడ్డి పార్టీ అన్న పేరు పడిపోయింది. దానితో రాయలసీమలో బలపడేందుకు, రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు కిరణ్ కుమార్ ను చేర్చుకున్నట్లుగా చెబుతున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీలో ఇక మనుగడ లేదని, రాష్ట్రంలో ఆ పార్టీ మళ్లీ పుంజుకోవడం కుదరదని గ్రహించిన కిరణ్, బీజేపీలో చేరేందుకు ఒప్పుకున్నారు..

రాజ్యసభ గిఫ్ట్ ?

కిరణ్ ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు. ఆయన వచ్చినందుకు ఏదోక ప్రయోజనం చూపించాలి. రాష్ట్రంలో ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలిచే అవకాశాలు తక్కువగానే ఉండటంతో ఆయన్ను రాజ్యసభకు పంపుతామని ముందే హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. త్వరలో ఉత్తర ప్రదేశ్ లేదా మధ్య ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆయన ఎన్నిక కావచ్చు…

This post was last modified on April 8, 2023 9:27 am

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

54 minutes ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

1 hour ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago