వైసీపీ ప్రభుత్వంలో మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా లభిస్తున్నాయని గతేడాది ఒక నివేదిక వచ్చింది. నార్కాటిక్స్ కంట్రోల్ బ్యురో వెల్లడించిన నివేదిక ప్రకారం గంజాయి రవాణా, విక్రయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానాన్ని పొందింది. పల్లెల్లో కూడా గంజాయి దొరుకుతోందని, యువత మాదక ద్రవ్యాలకు బానిస అవుతోందని ఆరోపణలు వినిపించాయి. గుజరాత్ నుంచి వస్తున్న గంజాయి ఏపీలో విక్రయం కావడంతో పాటు తూర్పు తీరం గుండా విదేశాలకు ఎగుమతి అవుతోందని నిర్ధారించారు.
రాష్ట్రాన్ని గంజాయి ప్రదేశ్ గా మార్చిన ఏపీ ప్రభుత్వాన్ని దించేస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు పలు పర్యాయాలు గుర్తు చేశారు. యువగళం పాదయాత్రలో కూడా లోకేష్ పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా తెలుగు దేశం ఒక ఉద్యమం ప్రారంభించింది. #GanjaOdhuBro హ్యాష్ ట్యాగ్ తో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఈ హ్యాష్ టాగ్ వల్ల ప్రజల్లో మార్పు వస్తుందని టీడీపీ విశ్వసిస్తోంది.. ఇదే అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్లో స్పందిస్తూ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి మహమ్మారిని తరిమి కొట్టే వరుకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెలిపారు..
This post was last modified on April 7, 2023 1:23 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…