వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ మందగించినట్లే కనిపించినా గుట్టుచప్పుడు కాకుండా వేగం పుంజుకుందని తెలుస్తోంది. దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను మార్చివేసి కొత్త సిట్ కు సీబీఐ డీఐజీ కే.ఆర్. చౌరసియాను చీఫ్ గా నియమించిన తర్వాత ఆయన చకచకా పనులు చేసుకుపోతున్నారు. ఎక్కడా మీడియాకు లీకులు ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని, ఆరు నెలల్లో ట్రయల్ ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించిన మరుసటి రోజే సిట్ తన పనులను ప్రారంభించింది..
అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సమన్లు ఇవ్వడం, వారి రావడం, లేదా టైమ్ అడగటం లాంటి పనులు వెంటనే జరిగితే మీడియా ప్రచారం తప్ప కేసు ముందుకు సాగడం లేదని చౌరసియా భావిస్తున్నారట. అందుకే కామ్ గా పనులు కానిచ్చేయ్యాలని డిసైడయ్యారట. అవినాష్ కు మలి దఫా సమన్లు ఇచ్చే లోపు పూర్తి ఎవెడెన్స్ సేకరించి ముందుకు సాగాలనుకుంటున్నారట. సీబీఐ అధికారులు కొందరు కడప, పులివెందుల వచ్చి వెళ్లినా బయటకు పొక్క కుండా చూసుకున్నారని చెబుతున్నారు..
సీబీఐ కొత్త రకం దూకుడు జగన్, అవినాష్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో వారు కొంత మేర టెన్షన్ అవుతున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అవినాష్ రెడ్డి నేరుగా ఢిల్లీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుని జగన్, ఆయన భార్య భారతీ రెడ్డితో మంతనాలు జరపారు. సీబీఐ పిలిస్తే ఏం చెప్పాలి, పరస్పర విరుద్ధమైన స్టేట్ మెంట్స్ రాకుండా ఎలా చూసుకోవాలని చర్చించినట్లు సమాచారం. న్యాయస్థానానికి సీబీఐ సమర్పించిన అఫిడవిట్లో అవినాష్ రెడ్డిపై చేసిన ఆరోపణలు, దర్యాప్తు సంస్థ అనుమానాలను ఎలా తిప్పికొట్టాలో చర్చించారు.
భారతీ రెడ్డి సహాయకుడిని సీబీఐ ఓ సారి ప్రశ్నించిన నేపథ్యంలో మరో సారి పిలిస్తే ఏం చేయాలో కూడా చర్చించారు. జగన్ రెడ్డి రెండు సార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి పెద్దలతో మాట్లాడిన అంశాలు మాత్రం చర్చకు రాలేదని తెలుస్తోంది. అయితే ఏం జరిగినా తాను చూసుకుంటానని భయపడవద్దని జగన్ అభయ హస్తం ఇచ్చారట. తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు మాత్రం ఈ భేటీపై ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదు. అన్నదమ్ములు కలిస్తే తప్పేముందంటూ మాట దాట వేస్తున్నారట..
This post was last modified on April 7, 2023 9:26 am
వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…