Political News

బండి సంజ‌య్‌కు ఊర‌ట‌.. బెయిల్ మంజూరు!

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్‌కు భారీ ఊర‌ట ల‌భించింది. 10వ తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్‌కు హ‌నుమ‌కొండ కోర్టు బుధ‌వారం 14 రోజుల రిమాండ్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా గురువారం అదే కోర్టులో బండి సంజ‌య్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు.. బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిని విచారించిన కోర్టు.. బెయిల్ మంజూరు చేసింది. అయితే.. దీనికి ముందు రోజు రోజంతా కూడా.. హైకోర్టులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

హ‌నుమకొండ కోర్టు రిమాండ్ విధించ‌డాన్ని స‌వాల్ చేస్తూ.. బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం అత్యవసర విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్టు చేశారని.. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని పిటిషన్‌లో బండి సంజయ్ పేర్కొన్నారు. కిలోమీటర్ల మేర వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ శారీరకంగా మానసికంగా వేధించారని.. పోలీసుల దాడిలో కాలికి, చేతికి గాయాలు కూడా అయ్యాయని పిటిషన్‌లో వివరించారు.

ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతున్నందునే అక్రమంగా కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నా రు. ఈ నెల 8 న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అరెస్టు విషయం లోక్సభ స్పీకర్కు సమాచారం కూడా ఇవ్వలేదన్నారు.

బండి సంజయ్‌ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు వాదించారు. ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. రిమాండ్ రద్దు చేయాలన్న పిటిషన్‌లో బెయిల్ ఎలా ఇవ్వగలమని హైకోర్టు ప్రశ్నించింది. ప్రత్యేకంగా వేరే బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చునని.. అవసరమైతే హౌజ్ మోషన్ వేయవచ్చని కోర్టు తెలిపింది.

ప్ర‌భుత్వ వాద‌న ఇదీ..
ప్రశ్నపత్రాలు బయటకు రావడం వెనక ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే భారీ కుట్ర ఉందని.. బండి సంజయ్ ప్రమేయంపై ఆధారాలున్నాయని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. అయితే.. ఎఫ్‌ఐఆర్‌లో బండి సంజయ్‌పై నిర్దిష్ట అభియోగాలేమీ లేవు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన ప్రమేయంపై ఎలక్ట్రానిక్ ఆధారాలు ఉన్నాయని తెలిపింది.

పంపిస్తే.. త‌ప్పేంటి? : హైకోర్టు
పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని ప్రతిపక్ష నేతగా ఇతరులకు పంపిస్తే తప్పేంటని హైకోర్టు అడిగింది. పరీక్షలను దెబ్బతీసేందుకు ఇతర నిందితులను బండి సంజయ్ ప్రోత్సహించారని ఏజీ వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయుడికి నోటీసులు జారీ చేసింది.

This post was last modified on April 7, 2023 8:16 am

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

15 minutes ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

2 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

4 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

4 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

4 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

5 hours ago