అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాజధాని Hyderabad పై 60 సెకన్ల నిడివితో రీల్ తీస్తే.. చాలు.. రూ.లక్ష గెలుచుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ‘హ్యాపెనింగ్ హైదరాబాద్ రీల్స్ కాంటెస్ట్’ నిర్వహిస్తోంది. ప్రైజ్ మనీ కింద విజేతకు రూ.50,000, ఫస్ట్ రన్నరప్ రూ.25,000, సెకండ్ రన్నరప్ రూ.10,000, ముగ్గురికి కన్సొలేషన్ ప్రైజ్ రూ.5వేలు చొప్పున.. మొత్తంగా రూ.లక్ష ఇవ్వనున్నట్టు తెలంగాణ డిజిటల్ మీడియా ప్రకటించింది. ఈ నెల 30లోపు ఈ పోటీలో పాల్గొనాలని సూచించింది.
ఇందుకోసం చేయవలసిందల్లా.. హైదరాబాద్‌లో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృధ్ధికి అద్దంపట్టే దృశ్యాలను 60 సెకన్ల నిడివి మించకుండా వీడియో తీయాలి. ఆ వీడియోను @DigitalmediaTS ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. ఆ తర్వాత వీడియో లింక్‌ను dir_dm@telangana.gov.inకు మెయిల్ చేయాలి. ఏప్రిల్ 30వ తేదీతో ఈ పోటీ ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం https://it.telangana.gov.in/contest/లో చూడాలని తెలంగాణ డిజిటల్ మీడియా తెలిపింది. మే రెండో వారంలో విజేతలను ప్రకటిస్తారు.
అభివృద్ది ఇలా..
తొమ్మిదేళ్లలో భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందింది. నగరంలోని ఎల్బీనగర్, గచ్చిబౌలి లాంటి ప్రధాన కూడళ్ల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. దశాబ్దం క్రితం హైదరాబాద్ వచ్చిన వారు.. ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తే కొన్ని ప్రాంతాలను చూసి గుర్తు పట్టలేరు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేందుకు.. మరింత ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీని పెట్టడం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్య.. మెదళ్ల పదును పెళ్లి.. సెల్ ఫోన్‌ను చేతబట్టి.. రంగంలోకి దిగిపోవడమే!!
This post was last modified on April 4, 2023 9:12 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…