Political News

కేసీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని బండకు బాదేసినట్లుగా బండి మాటలు

నోటి మాటకు ఎంత దురుసు ఉంటే.. అంత త్వరగా రాజకీయాల్లో పాపులర్ కావొచ్చు. ఎదుటోడు ఎంతటి తోపు అయితే మాత్రం.. లెక్క చేయకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడినంతనే.. అతడి మాటల్లోని మాటల కంటే కూడా సదరు నేత తెగింపునకు ముచ్చటపడే రోజులు వచ్చేశాయి. అదే ధోరణి.. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేసింది.

తాను టార్గెట్ చేసినోళ్లు ఎంతటోళ్లైనా ఏ మాత్రం కనికరం లేకుండా మాటలు అనేసే విషయంలో కేసీఆర్ ఎంత కరకుగా ఉంటారో.. అంతకు రెట్టింపు కరకుగా వ్యవహరించే తీరు బండి సంజయ్ తీరు ఉంటుంది. గులాబీ బాస్ కేసీఆర్ మాటలు మేధావులు సైతం అవును కదా? అనుకునేలా ఉంటే.. బండి మాటలు మాస్ కు మాత్రం మహా మజాకు గురి చేసేలా ఉంటాయి. ఈ కారణంతోనే బండి మాస్ లీడర్ గా అంతకంతకూ ఎదిగిపోతున్న పరిస్థితి.

తాజాగా సీఎం కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్.. కుమార్తె కవితను ఒకేసారి హోల్ సేల్ గా విమర్శల వర్షం కురిపించారు బండి సంజయ్. తాజాగా కొన్ని మీడియా సంస్థలు పబ్లిష్ చేసిన రాజ్ దీప్ సర్దేశాయ్ మాటలతో వచ్చిన కథనం ఆధారంగా చెలరేగిపోయారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రానున్న ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించే క్రమంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఘాటుగా రియాక్టు అయ్యారు.

‘‘ప్రతిపక్షాలకు డబ్బులు పెట్టుబడి పెట్టేస్థాయికి కేసీఆర్ ఎలా వచ్చాడో చెప్పాలి? నంది నగర్ ఇంట్లో ఉన్నప్పుడు బ్యాంక్ లోన్లు కట్టలేని కేసీఆర్ కు వేల కోట్లు ఎక్కడవి?’’ అని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న మంత్రి కేటీఆర్ ను క్యాబినెట్ నుంచి బయటకు పంపాలన్న బండి సంజయ్ రానున్న రోజుల్లో హైదరాబాద్ లో లక్షలాది మంది నిరుద్యోగులతో నిరుద్యోగ మార్చ్ ను నిర్వహిస్తామన్నారు. పరీక్షా పత్రాల లీకేజీలో భాగంగా తాజాగా పదో తరగతి హిందీ పేపర్ కూడా లీక్ కావటం సిగ్గుచేటన్నారు.

గడిచిన వారంగా ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల మీద పని లేనోళ్లు అనవసర చర్చ పెడుతున్నారని.. చదువుకు.. పదవులకు సంబంధం లేదన్నారు. అగ్రనేతగా ప్రపంచమే నరేంద్ర మోడీని గుర్తించిందని చెప్పారు. ‘‘80వేల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నాడు. కేసీఆర్ కొడుకు, కూతురు చదివిన చదువులకు లిక్కర్ దందా, డ్రగ్స్ దందా చేయమని చెప్పిందా?’’ అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉండేదని.. దాన్నికాస్తా అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ ది అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటే అంతర్జాతీయ దొంగల పార్టీగా అభివర్ణించిన బండి సంజయ్.. ‘గతంలో అపార్ట్మెంట్ లో ఉన్న కవితకు.. ఇల్లు లేని‌ కేటీఆర్ కు వేల కోట్లు, బంగళాలు ఎక్కడవి?’ అని సూటిగా ప్రశ్నించారు. ఒకేసారి కేసీఆర్ కుటుంబ సభ్యులు.. వారిఆర్థిక మూలాలపై బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి.. దీనికి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

This post was last modified on April 4, 2023 8:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

11 minutes ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

46 minutes ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

3 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

10 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

11 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

12 hours ago