కోన రఘుపతి. ఒకప్పటి కాంగ్రెస్ స్ట్రాంగ్ మేన్, మాజీ గవర్నర్ కోన ప్రభాకర్ రావు కుమారుడు. జగన్ వైసీపీని పెట్టినప్పటి నుంచి ఆయనతోనే ఉన్నారు. వరుసగా రెండో సారి బాపట్ల నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. ఇంకొకరు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుగా చెప్పుకోవాలి. ఇప్పుడు కోన రఘుపతికి కష్టకాలం వచ్చిందంటున్నారు.
బాపట్ల గడ్డ, కోన రఘుపతి అడ్డా అన్న పేరు క్రమంగా చెరిగిపోతోంది. ఆయన చేస్తున్న పనులు ఒక వైపు, నియోజకవర్గం వైసీపీలో పెరుగుతున్న వ్యతిరేకత మరో వైపు రఘుపతికి ప్రతికూలంగా మారాయి.
బాపట్ల నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అతి కొద్ది శాతమే ఉన్నా.. జగన్ రెడ్డి ఆయనకు రెండు సార్లు సీటు కేటాయించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఎందుకో ఆ పదవి నుంచి తీసేశారు.
పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రఘుపతి కలెక్షన్ కింగ్ అయిపోయారన్న వార్తలు వస్తున్నాయి..తన గెలుపు కోసం పనిచేసిన స్థానిక నేతలను, బ్రాహ్మణ సామాజిక వర్గం వారిని ఆయన పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు పెల్లుబికాయి. డబ్బులు వసూలు చేస్తున్నారని, సాయం కోసం వెళ్లిన వారి పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని తాడేపల్లి ప్యాలెస్ కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. సొంత పార్టీ నేతలే ప్రెస్ మీట్స్ పెట్టి మరీ రఘుపతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన కర్లపాలెం ఎంపీపీ వనజా.. ఎమ్మెల్యేపై బహిరంగంగానే తిరుగుబాటు చేశారు.
నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కోన రఘుపతికి వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు నడుపుతున్నారు. పార్టీ సీనియర్, వైసీపీ ఎస్సీ నేత రాజశేఖర్.. ఎమ్మెల్యే తీరును ఎండగుడతూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. బాపట్ల పట్టణ వైసీపీ అధ్యక్షుడు నరాసశెట్టి ప్రకాష్ ఓ అడుగు ముందుకేసి పార్టీ పదవికి రాజీనామా చేశారు..
బాపట్లలో క్రమంగా టీడీపీ పుంజుకుంటోంది. అదే సమయంలో నియోజకవర్గ పార్టీలో అంతర్గత కుమ్ములాట జగన్ కు తలనొప్పిగా మారింది. దానితో 2024 ఎన్నికల్లో రఘుపతికి టికెట్ ఇవ్వకుండా వేరొకరిని నిలబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on April 4, 2023 2:47 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…