YS Jagan Mohan Reddy
ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్న సామెత మాదిరిగా మారింది.. సీఎం జగన్ విషయంలో కర్ణాటక ఎన్నికల పరిస్థితి.! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. నిజమే. ఎందుకంటే.. ఇది ఏపీకి పొరుగున ఉన్నరాష్ట్రం. పైగా 2018లో బీజేపీకి అనుకూలంగా ఇక్కడ జగన్ బృందం ప్రచారం కూడా చేసింది. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్నందున.. ఎంతో కొంత రుణం తీర్చుకునేందుకు జగన్.. తాము సహకరిస్తున్నందున.. తమకు సాయం చేయాలని బీజేపీ.. రెండు పార్టీలు ఇద్దరు నాయకుల మధ్య డీల్ కుదిరినట్టు సమాచారం.
నిజానికి ఏపీలో ఉన్న పరిస్థితిని గమనిస్తే.. ఏ రాష్ట్రానికీ సహకరించనంతగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుజగన్‌కు సహకా రం చేస్తోంది. దీంతో ఇప్పటికే రాజ్యసభ సీటు ఇచ్చారు. అదేసమయంలో వివిధ చట్టాలకు పచ్చజెండా కూడా ఊపారు. ఇక, ఇప్పుడు బీజేపీకిప్రాణసంకటం.. ప్రాణ ప్రదంగా కూడా మారిన కర్ణాటక ఎన్నికల్లోనూ సాయం చేయాలనేది బీజేపీ పెట్టిన షరతుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీని, తెలంగాణను ఆనుకుని ఉన్న కర్నాటకలోని జిల్లాల్లో (దీనిని కళ్యాణ్ కర్నాటక అంటారు) ఉన్న 40 స్థానాల్లోనూ బీజేపీని గెలిపించే బాధ్యతను జగన్ కు అప్పగించారనే ప్రాచరం జరుగుతోంది.
పోనీ.. దీనికి జగన్ ఒప్పుకొన్నారనే అనుకుంటే.. ఇక్కడే మరో పెద్ద చిక్కు వచ్చింది. అదే కళ్యాణ కర్ణాకటలో జగన్‌కు దేవుడిచ్చిన అన్నయ్యగా పేరున్న మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డికూడా.. తన సొంత పార్టీ కళ్యాణ కర్ణాటక పక్ష కింద.. ఈ 40 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. దీంతో ఇప్పటికే.. తన సోదరుడు వరుసయ్యే జగన్‌కు ఆయన ఫోన్ చేసి.. మద్దతుకోరారనేది వైసీపీ నేతల మాట. దీనిని కాదనలేని పరిస్థితి. అనేక సంబంధాలు ఇరుపక్షాల మధ్య ఉన్న నేపథ్యంలో ఆమాత్రం సాయం కోరకుండా ఉండరు.
దీంతో ఇప్పుడు అటు మోడీ, ఇటు గాలి జనార్దన్‌లలో ఎవరికి హెల్ప్ చేయాలనేది జగన్ సంకటంగా మారిపోయింది. మోడీకి చేస్తే.. గాలికి కోపం. జనార్దన్‌రెడ్డిని కాదనలేని పరిస్థితి. వెరసి.. ఇప్పుడు జగన్ పరిస్థితి సంకటంలో పడిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఇప్పటికే ఒక అనంతపురం, ఒక చిత్తూరు మంత్రులను కర్ణాటక ఎన్నికలకు ప్రచారం కోసం పంపాలని నిర్ణయించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on April 2, 2023 11:44 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…