ఏపీలో కేజ్రీవాల్ నమూనాను అమలు చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారా? ఢిల్లీలో వరుస విజయాలు దక్కించుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వం తాలూకు ఫార్ములాను ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తున్నారా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇద్దరు కీలక ఎంపీలు గత వారం రోజులుగా ఢిల్లీలో అధ్యయనం చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నా యి.
ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వలోని ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన బీజేపీని, కాంగ్రెస్‌ను కూడా ఎదుర్కొని వరుస విజయాలు దక్కించుకుంది. దీనికి కారణం.. మొహల్లా క్లినిక్‌లు(ప్రతి వార్డుకు ఒక ఆసుపత్రి), కార్పొరేట్ స్కూళ్లను తలపించే ప్రభుత్వ ఆసుపత్రులు, అదేవిధంగా ప్రతి ఇంటికీ.. రోజూ 200 లీటర్ల మంచినీటిని అందించడం ద్వారా.. కేజ్రీవాల్ సర్కారు అక్కడ చేరువ అయింది.
ఈ నేపథ్యంలోనే అక్కడి ఫార్ములాను యథాతథంగా కాకుండా..ఏపీ అవసరాలకు అనుగుణంగా అమలు చేసేందుకు జగన్ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి డాక్టర్ కాన్సెప్టును తీసుకువచ్చారు. ఇది పూర్తిస్థాయిలో ఇంకా అమలు కాలేదు. ఇది కాకుండా.. ఇంకా ప్రజలకు చేరువ అయ్యేందుకు ఉన్న అన్ని మార్గాలను కూడా.. జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఏం జరుగుతోందనే విషయంపై వైసీపీ నేతలతో ఆయన అధ్యయనం చేయిస్తున్నారని సమాచారం.
అయితే.. కేజ్రీవాల్‌కు, సీఎం జగన్‌కు మధ్య చాలా వైరుద్యాలు ఉన్నాయి. కేజ్రీవాల్‌పై నిజాయితీ పరుడనే పేరుంది. ప్రస్తుతం వెలుగు చూసిన ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ ఆయన మంత్రుల పేర్లు వినిపిం చాయే తప్ప.. సీఎంపై ఈగ వాలలేదు. కానీ.. ఏపీలో అలా లేదు. సీఎం జగనే.. ఇక్కడ.. అనేక కేసుల్లో ఉన్నారు. ఇది మైనస్ కానుంది. ఇక, కేజ్రీవాల్ నాయకత్వంపై అక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ, ఇక్కడ బాహాటంగానే కనిపిస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తే.. అక్కడి ఫార్ములా ఇక్కడ వర్కవట్ అవుతుందని చెప్పడానికి అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 1, 2023 8:54 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…