తెలంగాణలో తాజాగా నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ సదస్సులో నటుడు, అన్నగారి కుమారుడు నంద మూరి బాలకృష్ణ హాట్ కామెంట్లు చేశారు. టీడీపీ స్థాపించకపోతే.. తెలుగు వారు ఢిల్లీకి దాసోహం చేయాల్సి వచ్చేందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న ప్రతినాయకుడు.. టీడీపీ గూటి నుంచి ఎగిరిపోయిన పక్షే.. అని సంచలన కామెంట్లు చేశారు. ఇక, టీడీపీ స్థాపించి.. అనతికాలంలోనే అధికారం చేపట్టి తెలుగువాడు ఎక్కడున్నా సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత అన్నగారు ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.
పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఎస్సీ రీజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని తెలిపారు. ఎన్టీఆర్ పాలనలో పేదలకోసం ఎన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకొచ్చారన్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగువారందరిని ఏకతాటిపై తెచ్చి అనతికాలంలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని బాలకృష్ణ గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్లు, మహిళలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రజల వద్దకే పాలన తెచ్చిన గొప్పవ్యక్తి అన్నారు. సహకార వ్యవస్థలో సింగల్ విండో విధానం తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. గురుకుల విద్యా బోధన, సంక్షేమ హాస్టళ్లు తీసుకువచ్చారని వివరించారు.
అలాంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని బాలయ్య పిలుపు నిచ్చారు. మొత్తానికి సినిమా డైలాగులతో బాలయ్య దంచికొట్టిన స్పీచ్‌కు పార్టీ కార్యకర్తల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.
This post was last modified on March 30, 2023 1:42 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…