ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీకి తెలంగాణలో పోటీ చేసే అర్హత ఉందని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలకు ప్రాణసంకటంగా ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత తెలుగు దేశం పార్టీ దేనని ఆయన తెలిపారు. అందుకే తాము ఇక్కడ పోటీకి అన్ని విధాలా అర్హులమని తెలిపారు.
ఇదేసమయంలో చంద్రబాబు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉ న్నారని తాజాగా జరిగిన టీడీపీ ఆవిర్భావ సదస్సులో వెల్లడించారు. అయితే, వారెవరు? అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. వంద నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాం.. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలి.. అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అయితే.. వంద నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందన్న ప్రకటన వెనుక ఉన్న మర్మమేంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తాను ఎవరితోనైనా పొత్తుకు రెడీ అని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారా? అనేది చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి సైతం 100 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేరు. ఉన్నవారిలోనూ చాలా మంది ప్రజల మధ్య బలాన్ని నిరూపించుకునే సత్తాలేదు.
ఈ నేపథ్యంలో పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి..చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించి ఉంటారని.. పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేసే నియోజకవర్గాల్లో బలమైన టీడీపీ శ్రేణులు.. ఉన్నారని.. హైదరాబాద్ అభివృద్ధి సహా శంషాబాద్ విమానాశ్రయాన్ని కూడా తానే నిర్మించానని చెప్పడం ద్వారా.. మరింత జోష్ పెంచుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని పరిశీలకులు అంటున్నారు. గతానికి ఇప్పటికి కొంత జోష్ పెరిగిన మాట వాస్తవమేనని క్షేత్రస్థాయిలోనూ నాయకులు చెబుతున్నారు. మరి చంద్రబాబు వ్యూహం తెలియాలంలో మరో రెండు మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on March 30, 2023 10:41 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…