Political News

జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!

ఏపీ సీఎంజ‌గ‌న్‌లో అనూహ్య‌మైన మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు త‌న సంక్షేమ ప‌థ‌కా ల‌కు కూడా తిరుగులేద‌ని భావించిన ఆయ‌న.. అప్పులు చేసైనా కూడా.. ఆయా ప‌ప‌థ‌కాల‌ను అమ‌లు చేశారు. అయితే.. తాజాగా జ‌రిగిన గ్రాడ్యుయేట్‌, ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎదురైన ప‌రాభ‌వాల నుంచి జ‌గ‌న్ పాఠాలు నేర్చుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌కు కార‌ణాలు వంటివి ఆయ‌న‌ను మార్పు దిశ‌గా అడుగులు వేసేలా చేస్తున్నాయ‌ని అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా.. మంత్రి వ‌ర్గంలోనూ కొంద‌రు త‌న‌కు స‌హ‌క‌రించ‌డం.. లేద‌ని, ప్ర‌తిప‌క్షాల దూకుడుకు అడ్డుక‌ట్ట వేయ‌డం లేద‌ని కూడా.. సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. స‌హ‌జంగానే ఏ ప్ర‌భుత్వ‌మైనా.. మంత్రులు దూకుడుగా ఉండాల‌ని కోరుకుంటుంది. కానీ, ఏపీలో ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. కీల‌క‌మైన ఫైర్ బ్రాండ్స్‌ను ప‌క్క‌న పెట్టేశారు. దీంతో ఇప్పుడు వారిని చేర‌దీసేందుకు.. మ‌రోసారి మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇక‌, అదేస‌మ‌యంలో సంక్షేమాన్ని మాత్ర‌మే న‌మ్ముకుంటే ప్ర‌యోజ‌నం లేద‌ని కూడా.. జ‌గ‌న్ ఒక నిర్ణ‌యా నికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా ర‌హ‌దారుల దుస్థితిపై ఆయ‌న క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌డాన్ని చూస్తే.. అభివృద్ధి మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. క‌నీస మౌలిక వ‌స‌తుల‌ను అభి వృద్ధి ప‌ర‌చాల‌నే విధంగా నిర్ణ‌యాలు తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు.

ఏతావాతా ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్‌లో మాత్రం అనూహ్య‌మైన మార్పు క‌నిపిస్తోంది. ఎవ‌రూ ఎక్క‌డా పార్టీని డైల్యూట్ చేయ‌కుండా.. మ‌రోసారి పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా.. కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ మార్పు నేప‌థ్యంలో పార్టీలోనూ ప్ర‌క్షాళ‌న‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. మార్పు మంచిదే అయినా.. ఇప్ప‌టికే చేతులు కాల్చుకున్న నేప‌థ్యంలో జ‌గ‌న్‌వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on March 30, 2023 9:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago