Political News

క‌ర్ణాట‌క‌లో మోడీకి ఎదురు గాలి.. స‌ర్వే ఏం చెబుతోందంటే!

బీజేపీ అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క‌ను మ‌రోసారి ద‌క్కించుకోవాల‌ని.. ఆ పార్టీ పెద్ద‌లు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్ప‌టికి మూడు మాసాలు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అభివృద్ధి ప‌నుల పేరిట‌.. ఐదు సార్లు వ‌చ్చి వెళ్లారు. వ‌చ్చిన ప్ర‌తిసారీ.. ఆయ‌న ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి అనుకున్న విధంగా ప‌రిస్థితి ఉండ‌ద‌ని.. తాజాగా వెలుగు చూసిన ఓ స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

కర్ణాటకలోని నియోజకవర్గాలను సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక, గ్రేటర్ బెంగళూరు, హైదరాబాద్ కర్ణాటక, ముంబయి కర్ణాటక, ఓల్డ్ మైసూర్‌గా విభజించి చూస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ABP CVoter సర్వే చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా చూసి కొన్ని అంచనాలు వెలువరించింది. వీటి ఆధారంగా చూస్తే…గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38% ఓట్లు దక్కాయి. ఈ సారి అది 40%కి పెరిగే అవకాశాలున్నాయి.

ఇక బీజేపీ విషయానికొస్తే…గత ఎన్నికల్లో 36% ఓట్లు రాబట్టుకుంది. ఈ సారి 34.7%కే పరిమితమయ్యే అవకాశమున్నట్టు ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఇక మరో కీలక పార్టీ JDSకి గత ఎన్నికల్లో 18% ఓట్లు సాధించింది. ఈ సారి 17.9% వరకూ సాధించే అవకాశముంది. ఇతర పార్టీలకు 7.3% ఓట్లు దక్కనున్నట్టు అంచనా వేసింది.

సీట్ల పరంగా చూస్తే…గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వచ్చాయి. బీజేపీ 104 చోట్ల విజయం సాధించింది. జేడీఎస్ 37 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆ తరవాత బీజేపీ చేతుల్లోకి అధికారం మారిపోయింది. అయితే…ప్రస్తుత అంచనాల ప్రకారం చూస్తే…కాంగ్రెస్‌కు 121 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 74, JDSకి 29 సీట్లు దక్కనున్నట్టు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా చూస్తే…కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు, బీజేపీకి 68 నుంచి 80,JDSకి 23 నుంచి 35 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మోడీ వ్యూహం పారేలా క‌నిపించ‌డం లేదు.

This post was last modified on March 30, 2023 1:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ బిగ్ బ్రేక్ ఇచ్చేసిన రాజమౌళి..

మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…

51 mins ago

ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ వైభవ్?

ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…

1 hour ago

మండ‌లిని ఇలా బ‌లోపేతం చేస్తున్నారు.. బాబు ఐడియా భేష్ ..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఐడియా వేస్తే.. తిరుగుండ‌దు. అది ఎన్నిక‌లైనా.. రాజ‌కీయాలైనా పాల‌న‌లో అయినా.. ఆయ‌న ఆలోచ‌న‌లు…

1 hour ago

గేమ్ ఛేంజర్ మీద ఒత్తిడి షురూ

పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…

3 hours ago

‘పుష్ప-2’ ఈవెంట్లో రభస రభస

‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…

3 hours ago