Political News

అమ‌రావ‌తి కేసు.. స‌ర్కారుపై సుప్రీం ఆగ్ర‌హం

అమ‌రావతి రాజ‌ధాని విష‌యంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ.. ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్ విష‌యంలో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. “ఎందుకంత తొంద‌ర ప‌డుతున్నారు? దానిలో మీ వ్య‌క్తి గ‌త ప్ర‌యోజ‌నాలు లేవుక‌దా.. ఉంటే చెప్పండి!” అని ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాదుల‌నుఉద్దేశించి.. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాస్త‌వానికి సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం అమ‌రావ‌తి కేసు విచార‌ణ‌కు రావాల్సి ఉంది. ఈ కేసుకు కోర్టురిజిస్ట్రీ 10వ నెంబ‌రు కేటాయించారు.

అయితే.. 8వ నెంబర్ కేసుపై విచారణ జరుగుతుండగా ధర్మాసనం ముందు అమరావతి కేసును ప్రస్తావించేందుకు ఏపీ న్యాయవాదులు ప్రయత్నించారు. దీంతో జస్టిస్ కేఎం జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు. అమరావతి పిటీషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని ఏపీ తరపు సీనియర్ న్యాయవాదులు నఫ్డే, నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ఒక కేసు సగం విచారణలో ఉండగా మరో కేసు ఎలా విచారించాలి..? అసలు ఎందుకు ఇంత తొంద‌ర ప‌డుతున్నారు? మీ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా? అని న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక కేసు విచారణ పూర్తి కాకుండా.. మరో కేసు విచారించడం తగదని అన్నారు. న్యాయమూర్తి కెఎం జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ లాయర్లు మిన్నకుండిపోయారు. కాగా.. సుప్రీం కోర్టులో కేసుల విచారణ జాబితా వరుస మారడంతో అమరావతి కేసుపై విచారణ ఆలస్యమైంది. మొదటి 5 కేసుల విచారణ తర్వాత 12వ నెంబర్ నుంచి 20 నెంబర్ కేసు వరకు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 7వ నెంబర్ కేసు నుంచి 11వ నెంబర్ కేసు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 21 నుంచి 39, 41వ నెంబర్ కేసులను కోర్టు విచారిస్తుంది. ప్రస్తుతం 10వ నెంబర్ కేసుగా అమరావతి రాజధాని కేసు ఉంది.

సుదీర్ఘ వాయిదా..

అమరావతి రైతుల పిటిషన్‌‌తో పాటు ప్రభుత్వం పిటిషన్‌పై విచారణను జులై 11కి ధర్మాసనం వాయిదా వేసింది. ప్రభుత్వం తరపు పిటిషన్‌ను జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం చెప్పింది. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదన్న ఏపీ తరపు సీనియర్ కౌన్సిల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. అయితే.. ఏపీ ప్రభుత్వ లాయర్లు చేసిన విజ్ణప్తులను న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసెఫ్ పట్టించుకోలేదు. జూన్ 16న జస్టిస్ కె ఎం జోసెఫ్ పదవీ విరమణ చేయనున్నారు. అందుకే కేసు విచారణను జులై 11కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

This post was last modified on March 28, 2023 7:13 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

50 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago