ఎమ్మెల్సీ ఎన్నికలతో మారిన ఏపీ రాజకీయ వాతావరణానికి తగ్గట్లు వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు విపక్షాలపై విరుచుకుపడే వైసీపీ.. ఇప్పుడు తమలో తాము అనుకునే పరిస్థితిలోకి వెళ్లిపోయింది. నష్ట నివారణ చర్యల విషయంలో సీఎం జగన్ మౌనం ఒకపక్క.. ఆయన కార్యకలాపాల్ని చక్కదిద్దే ఆయన సలహాదారు సజ్జల కొత్త తరహా దాడి ఎక్కువైంది. దీంతో.. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రాఘురామ క్రిష్ణరాజుసంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. రాజ్యాంగేతర శక్తిగా మారిన లక్ష్మీ పార్వతి పంచాయితీతో చోటు చేసుకున్న పరిణామాల్ని గుర్తుకు తెచ్చేలా వైసీపీ ఎంపీ మాటలు ఉన్నాయి. నాడు టీడీపీలో లక్ష్మీపార్వతిలా నేడు వైసీపీలో సజ్జల వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీలో తలెత్తిన సంక్షోభం లాంటిది మన పార్టీలో తలెత్తకుండా చూసుకోండి. ఎన్టీఆర్ మంచివారే అయినప్పటికీ లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావటంతో 1995లో టీడీపీలో సంక్షోభం తలెత్తింది.
సజ్జల రామక్రిష్ణారెడ్డి మన పార్టీలో లక్ష్మీ పార్వతిలా వ్యవహరిస్తున్నారని పలువురు చెబుతున్నారు. పరిస్థితి చేయి దాటక ముందే ఆయన్నుపక్కన పెట్టకపోతే ఎక్కువమందిలో అసంత్రప్తి పెరుగుతుంది.. అని వ్యాఖ్యానించారు. ఇప్పటికి అత్యధిక ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారన్న ఎంపీ రఘురామ.. ఒకప్పటి సాక్షి దినపత్రిక ఉద్యోగి సజ్జల రామక్రిష్ణారెడ్డికి రిపోర్టు చేయాలని చెప్పటం సరికాదన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన ఓటును జయమంగళ వెంకటరమణకు ఓటు వేశానని చెబుతున్నారని.. అయినా ఆయనపై చర్యలు తీసుకోవటం ఏమిటి? అని ప్రశ్నించారు. జగన్ కోసం మేకపాటి కుటుంబం ఎంత చేసిందంటూ గతాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేశారు.
వైసీపీ కోసం మేకపాటి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. వైసీపీ పెట్టాలనుకున్నప్పటి నుంచి మేకపాటి గౌతం రెడ్డి పార్టీకి వెన్నుముకగా మారారు. జగన్ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయనకు మద్దతుగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన శాసన సభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయమంగళానికి ఓటు వేశానని.. అందుకే ఆయన గెలిచారని చెబుతున్నారు. అయినప్పటికీ చంద్రశేఖర్ రెడ్డిపై వేటు వేయటం సిగ్గుచేటు” అని వ్యాఖ్యానించారు. రెబల్ ఎంపీ రఘురామ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి.. దీనికి వైసీపీ అధినాయకత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.
This post was last modified on March 28, 2023 12:47 pm
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…