Political News

ముగ్గురు కాదు అయిదుగురు.. జగన్ ఉద్వాసన పలకున్న మంత్రులు ఎవరు?

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైనట్లుగా సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కావడంతో వైసీపీ మంత్రులలో టెన్షన్ మొదలైంది. అదేసమయంలో మంత్రి పదవులను ఆశిస్తున్నవారిలో ఆశలు చిగురిస్తన్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండడంతో ఈలోగా అమాత్యులు అనిపించుకోవాలని చాలామంది ఆశపడుతున్నారు. అయితే… ప్రస్తుత కేబినెట్లో ఎంతమందిని జగన్ తప్పిస్తారు.. కొత్తగా ఎంతమందికి అవకాశం ఇస్తారనే విషయంలో పార్టీలోనే పరిపరివిధాలుగా వినిపిస్తోంది. ముగ్గురు మంత్రులు స్థానం కోల్పోనున్నారని కొందరు చెప్తుండగా.. అయిదుగురు మంత్రులను తప్పించడానికి జగన్ సిద్ధమయ్యారని మరో వాదన కూడా వైసీపీ నుంచి వినిపిస్తోంది.


మంత్రివర్గ విస్తరణ కోసమే జగన్ గవర్నర్‌ను కలిశారని తెలుస్తోంది. మండలి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉండొచ్చంటూ ఇదివరకే వార్తలొచ్చాయి. ఆశించిన స్థాయిలో పనితీరును కనపర్చని మంత్రులను జగన్ సాగనంపుతారని, వారి స్థానంలో మండలి ఎన్నికల్లో గెలిచిన వారికి అవకాశం కల్పిస్తారనే అభిప్రాయాలు వెలువడ్డాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో జగన్ భేటీ అయిన నేపథ్యంలో- ఈ నెల 30 లేదా 31వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రివర్గ ప్రక్షాళనలో ముగ్గురు నుంచి అయిదుమంది వరకు ఉద్వాసన తప్ప దంటున్నారు. వారి ప్లేస్ లో కొత్తవారికి స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన పలుకుతారనేది ఉత్కంఠతను రేపుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కూడా వైఎస్ జగన్ ఈ దిశగా సంకేతాలను పంపారు…నియోజకవర్గాల నుంచి క్షేత్రస్థాయిలో అందిన నివేదికల ఆధారంగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగన్ ఆ ప్రాంతంలోని మంత్రులను మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు.


అదేసమయంలో కొత్తగా మంత్రి పదవి దక్కించుకునేవారిలో మర్రి రాజశేఖర్, తోట త్రిమూర్తులు పేర్లు వినిపిస్తున్నాయి. ఉండవల్లి శ్రీదేవి ఇష్యూ నేపథ్యంలో డొక్యా మాణిక్య వరప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. రాయలసీమ ప్రాంతం నుంచి పదవులు దక్కించుకుంటారంటూ పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నా స్పష్టత రాలేదు.

This post was last modified on March 28, 2023 9:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విరాట్ కోహ్లీ చివరి సిరీస్ ఇదేనా?

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్‌గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో…

7 mins ago

‘వైల్డ్ ఫైర్’ దేశమంతా అంటుకుంటోంది: రాజమౌళి

అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ నిన్న సాయంత్రం రానే వచ్చింది. వచ్చీ రాగానే సోషల్…

14 mins ago

వైసీపీ రాబందుల ప‌నిప‌డ‌తాం: మంత్రి అన‌గాని వార్నింగ్‌

ఏపీ రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్రసాద్‌.. అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌ల‌ను ఆయ‌న రాబందుల‌తో పోల్చారు. రాబందుల…

21 mins ago

ప‌వ‌న్ కోసం.. హైవే పై అఘోరి ర‌చ్చ‌!

గ‌త కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హ‌ల్చ‌ల్ సృష్టిస్తున్న మ‌హిళా అఘోరి వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతోంది. ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ..…

29 mins ago

మహారాష్ట్ర లో పవన్ ప్రచారం హిట్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడిన విధానం అక్కడి జనాలను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా హిందువులపై జరిగిన దాడులపై…

30 mins ago

ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కి కాఫీ బ్రేక్‌లోనే..

ఇండియా నుంచి అమెరికా విమాన ప్రయాణానికి 18 గంటలు పడుతుందని మీరు ఆలోచిస్తున్నారా? అయితే త్వరలో అది కేవలం నిమిషాల్లోనే…

30 mins ago