Political News

చూశారా.. వైసీపీ కోసం వాళ్లెవ‌రూ రాలేదు!

ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సామాజిక వ‌ర్గం అయితే.. జ‌గ‌న్‌ను మోసిందో.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సామాజిక వ‌ర్గం అయితే .. జ‌గ‌న్ సీఎం కావాల‌ని వెయ్యిక‌ళ్ల‌తో ఎదురు చూసిందో.. ఆ సామాజిక వ‌ర్గం కిక్కురుమ‌న‌లేదు. నిజానికి 2019 ఎన్నిక‌ల‌కు ముందు .. జ‌గ‌న్ కోసం.. జ‌గ‌న్‌చేత‌.. జ‌గ‌న్ కొర‌కు.. అని న‌డిచిన రెడ్డి సామాజిక వ‌ర్గం.. ఆస్తులు అమ్ముకుని కూడా.. ఆయ‌న ను గెలిపించేందుకు కృషి చేసింది. అనేక రూపాల్లో సాయం చేసింది.

అయితే.. నాలుగేళ్లు తిరిగే స‌రికి… అదేసామాజిక వ‌ర్గం జ‌గ‌న్‌కు దూర‌మైంది. నిజానికి గ‌త రెండేళ్ల నుంచి కూడా రెడ్డి సామాజిక వ‌ర్గం పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. చాలా త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే టాక్ ఉంది. ముఖ్యంగా రెడ్డి వ‌ర్గం చాలా బ‌లంగా ఉన్న, శాసించే స్థాయిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు, క‌ర్నూలు.. ఈ జాబితాలోనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఇవే జిల్లాల్లో వైసీపీ విష‌యంలో వారు మౌనంగా ఉంటున్నారు.

వాస్త‌వానికి టీడీపీని తీసుకుంటే.. చంద్ర‌బాబునుకానీ.. పార్టీని కానీ.. ఎవ‌రైనా ఏమైనా అంటే.. వెంట‌నే బాబు సామాజిక వ‌ర్గం నేత‌లు లైన్‌లోకి వ‌చ్చేస్తారు. ఆయా వ్యాఖ్య‌ల‌ను వారు ఖండిస్తారు. మీడియా స‌మావేశాలు ఇర‌గ‌దీస్తారు. కానీ.. ఆదివారం రాష్ట్రంలో వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేలు సీఎం జ‌గ‌న్ స‌హా పార్టీపై విరు చుకుప‌డ్డారు. వైసీపీని ఏకంగా గూండాల పార్టీగా ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లిశ్రీదేవి అభివ‌ర్ణించారు. అయినా.. ఒక్క రెడ్డి నాయ‌కుడు కూడా ముందుకు రాలేదు.

ఇక‌, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి మ‌రింత దూకుడుగా కామెంట్లు చేశారు. “రాజ‌కీయాల్లొకి వ‌చ్చింది.. కు టుంబ స‌భ్యుల‌ను హ‌త్య చేయించ‌డానికి కాదు” అన్నారు. ఇది ఎవ‌రిని అన్నారో.. ఆయ‌న ఎందుకు అన్నారో.. కూడా అంద‌రికీ తెలిసిందే. అయినా.. ఎవ‌రూ నోరు విప్ప‌లేదు. అస‌లు ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌ర‌కు కూడా.. రెడ్డినేత‌లు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా.. ముందుకు రాలేదు.

రాజ‌కీయాల‌కు అతీతంగా ఆయ‌న పాదయాత్ర‌కు స‌హ‌క‌రించిన వారు కానీ, జ‌గ‌న్‌ను అభిమానించేవారు కానీ.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై నోరు విప్ప‌లేదంటే.. ప‌రిస్థితి అర్ధం అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఇప్పుడు వీరికిప్ర‌త్యామ్నాయం అంటూ.. ఏదైనా దొరికితే..ఇక‌, జ‌గ‌న్ స‌ర్దుకోవాల్సి ఉంటుంద‌ని కూడా వారు హెచ్చ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 27, 2023 7:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మండ‌లిని ఇలా బ‌లోపేతం చేస్తున్నారు.. బాబు ఐడియా భేష్ ..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఐడియా వేస్తే.. తిరుగుండ‌దు. అది ఎన్నిక‌లైనా.. రాజ‌కీయాలైనా పాల‌న‌లో అయినా.. ఆయ‌న ఆలోచ‌న‌లు…

10 mins ago

గేమ్ ఛేంజర్ మీద ఒత్తిడి షురూ

పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…

1 hour ago

‘పుష్ప-2’ ఈవెంట్లో రభస రభస

‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…

2 hours ago

మీనాక్షి.. హీరోల గురించి ఒక్క మాటలో

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…

2 hours ago

ద‌ర్శ‌కుడైతే ఎవరికెక్కువ..

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ద‌ర్శ‌కుడైనంత మాత్రాన చ‌ట్టాలు పాటించ‌రా? అని…

2 hours ago