Political News

జ‌నం ఓకే.. ‘లౌక్యం’ ఏది జ‌గ‌న‌న్నా…!

త‌న‌కు ప్ర‌జాబ‌లం ఉంద‌ని.. దీనినే తాను న‌మ్ముకున్నాన‌ని.. ప‌దే ప‌దే చెబుతున్న సీఎం జ‌గ‌న్‌.. లౌక్యాన్ని విస్మ‌రించారు. త‌ను చెప్పిందే వేదం.. తాను గీసిందే ల‌క్ష్మ‌ణ రేఖ అన్న‌ట్టుగా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. దీనివ‌ల్ల పార్టీ న‌ష్ట‌పోతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి జ‌గ‌న్ పార్టీ వైసీపీ ఏమీ.. తీసేయాల్సింది కాదు. పుల్ల‌పుల్ల పేర్చి పెట్టుకున్న పిచ్చుక గూడు మాదిరిగా.. అనేక క‌ష్ట‌న‌ష్టాల‌కు.. కేసుల‌కు ఓర్చుకుని.. క‌ట్టుకున్న పొద‌రిల్లు లాంటి పార్టీ వైసీపీ.

ఆదిలో అంటే.. పార్టీ ప్రారంభంలో .. అస‌లు ఎలాంటి అంచ‌నాలూ లేవు. ప‌ట్టుమ‌ని 100 మంది నాయ‌కులు కూడాలేరు. అయినా.. మొక్క‌వోని దీక్ష‌తో జ‌గ‌న్ పార్టీని ముందుకు న‌డిపించారు. త‌ర్వాత త‌ర్వాత‌.. నాయ‌కులు వ‌చ్చి చేరారు. పాద‌యాత్ర‌తో ఇది ప్ర‌భంజ‌నంగా మారింది. అయితే.. పార్టీ త‌న‌దే అయినా.. నాయ‌కులు లేకుండా పార్టీ న‌డుస్తుందా? అనే చిన్న సూత్రాన్ని మాత్రం జ‌గ‌న్ విస్మ‌రించార‌నేది వాస్త‌వం. అదే ఇప్పుడు పార్టీకి మైన‌స్‌గా మారిపోయింది.

పార్టీలో త‌ల్లి, చెల్లిల పాత్ర‌ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్ట‌డం ద్వారా.. నాయ‌కుల్లో ఆత్మ‌స్థ‌యిర్యాన్ని జ‌గ‌న్ కోల్పోయేలా చేశార‌నేది కూడా వాస్త‌వం. ఎందుకంటే.. చాలా మంది నాయ‌కులు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయారు. పార్టీకి ఎంత చేసినా.. చివ‌రి నిముషంలో త‌మ ప‌రిస్తితి కూడా అంతేనా? అనే ప్ర‌శ్న‌లు కూడా ఉదయించాయి. ఇప్పుడు పార్టీకి వ్య‌తిరేకంగా మారింది న‌లుగురే కావొచ్చు. కానీ, అదే టీడీపీ మ‌రో ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌ను పోటీకి పెట్టి ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేదో!! అనే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది.

రాజ‌కీయంగా ప్ర‌జ‌లు అవ‌స‌ర‌మే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, అదే స‌మ‌యంలో పార్టీ జెండా ప‌ట్టుకునేవారు..అ జెండాను ముందుకు తీసుకువెళ్లేవారు కూడా పార్టీకి అవ‌స‌రం. ఈ విష‌యాన్ని జ‌గ‌న్‌.. విస్మ‌రించి.. స్కూల్ పిల్ల‌ల వ్య‌వ‌హారం మాదిరిగా పార్టీని న‌డిపించారు. తాను చెప్పిందే వినాల‌నే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఏముంది.. స్కూలు పిల్ల‌ల్లాగా.. ఉంది మా ప‌రిస్థితి. అక్క‌డైనా అంతో ఇంతో స్వేచ్ఛ ఉంటుంది. మాకు అదీ లేదు అని కొన్నాళ్ల కిందట నిర్వ‌హించిన స‌మావేశంపై ఓ ఎమ్మెల్యే బాహాటంగానే విమ‌ర్శ‌లు గుప్పించారు.

అడుగ‌డుగునా నిఘా.. అసంతృప్తి.. హెచ్చ‌రిక‌లు.. పార్టీ నేత‌ల‌కు అందుబాటులో లేక పోవ‌డం.. వంటివి జ‌గ‌న్‌కు నేత‌ల‌కు మ‌ధ్య దూరాన్ని బాగా పెంచేశాయి. దీనికితోడు.. లౌక్యం లేక‌పోవ‌డం మ‌రింత‌గా పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టించింద‌న‌డంలో సందేహం లేదు. ఎవ‌రికైనా టికెట్ ఇచ్చేదీ ఇవ్వందీ.. ఎన్నిక‌ల‌కు ముందు చెబుతారు.. లేదా..వారి పెర్ఫార్మెన్స్‌.. ను కూడా అప్పుడే అంచ‌నా వేస్తారు. కానీ, జ‌గ‌న్ మాత్రం ఏడాది రెండేళ్ల ముందుగానే .. ఎమ్మెల్యేల‌కు చేసిన హెచ్చ‌రిక‌లు లౌక్యం లేకుండా చేసిన వాద‌న‌లు పార్టీకి శాపంగా మారాయి. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. రేపు పార్టీలో మిగిలేది.. స‌ల‌హాదారులేన‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago